హైదరాబాద్: క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారా బ్యాంకు కస్టమర్లు డబ్బు జమ చేయడం తప్పనిసరి కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇది కేవలం సూచన మాత్రమే, తప్పనిసరి కాదు అని బ్యాంక్ తెలిపింది. క్యాష్ డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్ళిన ఒక వ్యక్తికి అనుకోని సంఘటన ఎరురైంది.

క్యాష్ డిపాజిట్ చేయడానికి బ్యాంకు అధికారి నిరాకరించారని, క్యాష్ డిపాజిట్ మెషీన్ (సిడిఎం) ద్వారా మాత్రమే డిపాజిట్లు చేయలని చెప్పడంతో కస్టమర్ ఎస్‌బి‌ఐకి ఫిర్యాదు చేశాడు.

ఎస్. రామలింగం అనే వ్యక్తి లాక్ డౌన్ సమయంలో ఎస్‌బి‌ఐ చిక్కడపల్లి శాఖకు వెళ్లారు. 9వేలు డెపాజిట్ చేయడానికి బ్యాంకు అధికారిని సంప్రదించగా అతను క్యాష్ డిపాజిట్ నిరాకరించి క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారా మాత్రమే డబ్బులు డెపాజిట్ చేయాలని తిరిగి పంపించాడు.

రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే బ్యాంక్ ద్వారా డెపాజిట్ చేసుకుంటామని రూ.1 లక్ష కంటే తక్కువ ఉంటే క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారా మాత్రమే డెపాజిట్  చేయాల్సి ఉంటుందని ఆయనకు తెలిపారు. 

దీంతో  కస్టమర్ బ్యాంకు ఏ‌జి‌ఎంకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు, కాని ఆమె ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఆమే 1 లక్ష  కన్నా తక్కువ నగదును స్వీకరించవద్దని బ్యాంకు ఉద్యోగులకు సూచించారు. తన డబ్బును క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారా జమ చేయమని కోరారని కస్టమర్ ఆరోపించాడు.

also read ఎస్‌బీఐలో ఉద్యోగుల కోసం కొత్త స్కీము.. డిసెంబర్‌ 1 నుంచి అమలు.. ...

ఎటిఎమ్ రద్దీగా ఉందని, కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని రామలింగం ఏ‌జి‌ఎంకి చెప్పినప్పటికి ఆమె అతనితో "మీరు వైరస్ బారిన పడకూడదనుకుంటున్నారు, కానీ మీరు మా సిబ్బందికి సోకేల చేస్తున్నారు" అని ఆరోపించారు.

సింగిల్-విండో కౌంటర్లలో నగదును స్వీకరించడానికి బదులు సిడిఎంలకు కస్టమర్లను పంపడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తికి చిక్కడపల్లి బ్రాంచ్ ఉద్యోగులు ప్రోత్సహిస్తున్నారని రామలింగం ఆరోపించారు. రామలింగం మరో మూడు శాఖలను సందర్శించిన వారు నగదును సిడిఎంలలో జమ చేయమని చెప్పారు.

తన ఫిర్యాదును అనుసరించి తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా రామలింగంకు రాసిన లేఖలో  “లాక్ డౌన్ సమయంలో కస్టమర్లు బ్యాంకు సందర్శనలను తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించమని కొరాము.

అలాగే కస్టమర్ సర్వీస్ కోసం సూచనలను పాటించాలని మేము చిక్కాడ్‌పల్లి బ్రాంచ్ తో పాటు ఇతర శాఖలను అభ్యర్థించాము. ” అని తెలిపారు.

 ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దేబాషిష్ మిశ్రా మాట్లాడుతూ “మేము డిజిటల్ సర్వీసుల ఉపయోగం పెంచాలనుకుంటున్నాము. బ్యాంక్ పని సమయలలో మేము సిడిఎంలను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహిస్తాము. ఇది తప్పనిసరి కాదు, సూచన మాత్రమే.

చాలా మంది ప్రజలు, ముఖ్యంగా దుకాణదారులు వారి షాపులను వదిలి రాలేరు. అలాగే బ్యాంకులు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. క్యాష్ డిపాజిట్ మెషిన్స్ దుకాణదారులకు, వ్యాపారవేత్తలకు బ్యాంకు పని గంటలకు మించి కూడా ఉపయోగపడతాయి ” అని అన్నారు.