ఐటీ/ఐటీఈఎస్ (ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీలో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో టెక్ మహీంద్రా మంగళవారం ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిపి గుర్నాని మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల ఎంటర్ప్రైజెస్లో మారుతున్న ఇంజనీరింగ్ అవసరాలను తీర్చడానికి కంపెనీకి వీలు కలుగుతుందని అన్నారు.
వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో 3000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా మంగళవారం ప్రకటించింది. టెక్ మహీంద్రా ఇండియాలో ఐదవ అతిపెద్ద కంపెనీ. అయితే, గుజరాత్‌లో కంపెనీకి ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య గురించి కంపెనీ ఎలాంటి వివరాలను బహిర్గతం చేయలేదు.
టెక్ మహీంద్రా మంగళవారం IT/ITES (IT ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిపి గుర్నాని మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల ఎంటర్ప్రైజెస్లో మారుతున్న ఇంజనీరింగ్ అవసరాలను తీర్చడానికి కంపెనీకి వీలు కలుగుతుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు.
ఐటీ/ఐటీఈఎస్ పాలసీలో దేశీయ, గ్లోబల్ కంపెనీలతో ప్రభుత్వం ఇప్పటి వరకు 15 ఒప్పందాలు కుదుర్చుకుందని, దీంతో రాష్ట్రంలో దాదాపు 26,750 స్కిల్డ్ ఐటీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
