నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రా రామకృష్ణకు (Chitra Ramkrishna) సంబంధించిన నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, ముంబైలలోని చిత్రా రామకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరుగుతున్న విషయాన్ని ఐటీ అధికారులు ధ్రువీకరించారు.
నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రా రామకృష్ణకు (Chitra Ramkrishna) సంబంధించిన నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. NSE యొక్క అంతర్గత రహస్య సమాచారాన్ని తెలియని వ్యక్తికి పంచుకోవడం ద్వారా అక్రమ ఆర్థిక లాభాలను ఆర్జించారనే ఆరోపణలపై చిత్రా రామకృష్ణపై దర్యాప్తు జరుగుతోంది. చెన్నై, ముంబైలలోని చిత్రా రామకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరుగుతున్న విషయాన్ని ఐటీ అధికారులు ధ్రువీకరించారు. సెబీ ఆదేశాల నేపథ్యంలో ముంబై, చెన్నైలలో సోదాలు జరుగుతున్నాయని, ఐటీకి చెందిన ముంబై విభాగం ఈ సోదాలకు నేతృత్వం వహిస్తోందని సమాచారం.
పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలను తనిఖీ చేయడం లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు NSE ఎండీ, సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, 2013లో చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ (సీఎ్‌సఓ) నియామకంలో కార్పొరేట్ పాలన ప్రమాణాల ఉల్లంఘన, రహస్య సమాచారాన్ని తెలియని వ్యక్తికి పంచుకున్నారనే ఆరోపణలపై సెబీ తాజాగా ఆమె చర్యలు చేపట్టింది. ఆమెకు రూ. 3 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మాజీ వైస్ చైర్మన్ రవి నారాయణ్, మాజీ సీఎస్‌ఓ ఆనంద్ సుబ్రమణియన్‌తో పాటు ఎన్‌ఎస్ఈపై రూ.2 కోట్ల చొప్పున పెనాల్టీ విధించింది. అప్పట్లో చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వీఆర్ నరసింహన్‌కు రూ.6 లక్షల ఫైన్ పడింది. ఇక, హిమాలయాల్లో నివసించే ఒక ‘యోగి’ తనకు మార్గనిర్దేశం చేస్తున్నాడని చిత్రా రామకృష్ణ స్పష్టం చేసినట్లు తెలిసింది.
