సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌విబి)ని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చే ఆలోచనకు తాను సిద్ధంగా ఉన్నానని టెస్లా, ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు.సిలికాన్ వ్యాలీ అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంకు. బ్యాంకు ఆస్తులు దాదాపు 210 బిలియన్ డాలర్లు కాగా, ఇది టెక్ కంపెనీలు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించే ప్రముఖ US బ్యాంక్ కావడం విశేషం.
ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ అమెరికా దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) అమెరికాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఉంది. అయితే బ్యాంకు ఇటీవలే దివాళా తీసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్యాంకు గురించే చర్చ ప్రారంభం అయ్యింది. అయితే ఈ బ్యాంకుకు మొత్తం 17 శాఖలు దేశంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ ఈ బ్యాంకును కొనుగోలు చేసేందుకు తనకు ఆసక్తి ఉన్నట్లు ట్వీట్ ద్వారా సూచించాడు. ఇదొక్కటే కాదు ఎలోన్ మస్క్ దీన్ని కొనుగోలు చేసిన తర్వాత పూర్తిగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించే సంస్థగా మార్చే అవకాశం ఉందనే వార్త కూడా తెరపైకి వచ్చింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) ఎలాన్ మస్క్ కొనుగోలు చేయనున్నారనే చర్చ తెరపైకి రావడానికి గల కారణాలను తెలుసుకుందాం.
నిజానికి ఓ ఎలక్ట్రానిక్స్ తయారీదారు రేజర్ సహ వ్యవస్థాపకుడు తన ట్వీట్ ద్వారా ఈ చర్చకు తెరలేపారు. ట్విట్టర్ అధిపతి మస్క్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలని రేజర్ సహ వ్యవస్థాపకుడు మిన్-లియాంగ్ టాన్ ట్వీట్‌లో సూచించారు . ఈ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ ఆలోచనకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పందిస్తూ తెలిపారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని గత శుక్రవారం US రెగ్యులేటర్లు పూర్తిగా మూసివేశారు. నియంత్రణ సంస్థ బ్యాంకు వినియోగదారుల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది 2008లో తలెత్తిన లేమన్ బ్రదర్స్ బ్యాంకు కుంభకోణంతో సమానంగా పోల్చుతున్నారు. US బ్యాంకింగ్ రంగంలో ఇది రెండో అతిపెద్ద వైఫల్యంగా చెబుతున్నారు. సంస్థ నష్టాలను తిరిగి పొందే అవకాశం లేదని మీడియా నివేదికలు వెల్లడించాయి. పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా ఆస్తుల విక్రయం, అందువల్ల మూసివేయవలసి వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటి. ఇది కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌లో 17 శాఖలతో USలో 16వ అతిపెద్ద బ్యాంక్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్వీట్ తర్వాత, బ్యాంక్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ బ్యాంకు గురించి ఎలాన్ మస్క్ ఇంకా ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తాడో సమయం మాత్రమే సమాధానం చెప్పగలదు.
