IRCTC Tirumala Package: ఒక్క రోజులో తిరుమల వెళ్లి రావాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే IRCTC ప్యాకేజీ మీ కోసం..
తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే సమయం లేదా కేవలం ఒక్క రోజులోనే మీరు తిరుపతి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాదుకు చేరుకునేలా ఒక భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలా కాలంగా పాటు కుటుంబంతో కలిసి తిరుపతి యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా కానీ సమయాభావం, ఎక్కువ ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా, IRCTC తిరుమల యాత్ర టూర్ ప్యాకేజీ మీకు మీ కుటుంబానికి ఉత్తమమైనది. మీరు ఎక్కడైనా హైదరాబాద్ నుంచి తిరుమల సందర్శించాలనుకుంటే, వెంటనే ఈ IRCTC ప్యాకేజీని బుక్ చేసుకోండి. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజులోనే తిరులమ దర్శనం, వసతి, ప్రయాణం వంటి సౌకర్యాలు అందిస్తారు. తిరుమల దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది ఏ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో చూద్దాం.
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ పేరు గోవిందం, రైలు ద్వారా ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణం సాగుతుంది. ఐ ఆర్ సి టి సి కి చెందిన ఈ ప్యాకేజీలో తిరుమల శ్రీవారి దర్శనం, హోటల్ గది, ప్రయాణం మొత్తం కవర్ అవుతాయి. మీరు కుటుంబంతో సహా ఈ టూర్కు వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఒక్కో వ్యక్తికి 3800 చార్జ్ చేస్తున్నారు. ఇందులో కేవలం ఒక రోజులోనే మీరు దర్శనము, ప్రయాణము, వసతి కల్పిస్తున్నారు.
టూర్ ప్యాకేజీ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం..
మొదటి రోజు హైదరాబాదు లింగంపల్లి నుంచి సాయంత్రం ఐదు గంటల 25 నిమిషాలకు రైలు ప్రారంభం అవుతుంది. అనంతరం రైలు సికిందరాబాద్ కు 6 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి నల్లగొండలో మరో హాల్టు ఉంటుంది.
ఇక రాత్రంతా ప్రయాణించిన తర్వాత.. తెల్లవారుజామున 5.55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి హోటల్ గదికి తీసుకొని వెళ్తారు. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తిరుమల కొండ మీదికి తీసుకుని వెళ్తారు. ఉదయం తొమ్మిది గంటలకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కింద మీరు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది దర్శనం అనంతరం. తిరుపతికి ప్రయాణం ఉంటుంది తిరుపతిలో భోజనం చేసుకున్న తర్వాత నేరుగా సాయంత్రం 6.25 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కిస్తారు.
మరుసటి రోజు తెల్లవారుజామున 5:35కు సికింద్రాబాద్ కు రైలు చేరుకుంటుంది. దీంతో మీ ప్రయాణం ముగుస్తుంది.మీరు ఏసీ కోచ్ లో ప్రయాణించాలి, అనుకుంటే అదనపు ప్యాకేజీని చెల్లించాల్సి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా అన్ని చార్జీలు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ప్రయాణికులు తమ వెంట ఆధార్ కార్డును లేదా ఇతర ప్రభుత్వ సంబంధిత గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC వెబ్ సైట్ లో సంప్రదించడం ద్వారా మీరు పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ప్యాకేజీ ఎప్పుడు ఉంటుంది అలాగే సంవత్సరం ఎన్ని రోజులు ఈ ప్యాకేజీ ఉంటుంది అనే వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.