హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తుల కోసం శబరిమల రైల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. శబరిమల యాత్రకు వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. 


ఐఆర్‌సిటిసి సేవలను సులభతరం చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని యాత్రికుల కోసం ఈ ప్యాకేజీ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్యాకేజీ మొత్తం 3 రోజులు, 2 రాత్రులు. 

ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీ చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో శబరిమల వెళ్లాలనుకునే భక్తులు చెన్నై చేరుకొని అక్కడి నుంచి శబరిమలకు వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై సమీపంలో ఉండే తెలుగు భక్తులకు ఈ ప్యాకేజీ మంచి ప్రయోజకరంగా ఉంటుంది.అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీ ధరను రూ.రూ.2,990 నిర్ణయించారు. 

ప్రతీ వారంలోని గురువారం, శుక్రవారం రోజున చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుండి శబరిమల టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ చెన్నై నుంచి కొట్టాయం మీదుగా  శబరిమలకు వెళ్తుంది.మొదటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో 12695 నెంబర్ గల రైలు ప్రారంభంవుతుంది.

రెండో రోజు తెల్లవారుజామున 4:00 గంటలకు కొట్టాయం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పంబకు బయల్దేరాలి. నీలక్కల్ దగ్గర భక్తుల్ని వదిలిపెడతారు. నీలక్కల్ నుంచి పంబ వరకు ప్రభుత్వ బస్సులో సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటుంది. 

సాయంత్రం 4.00 గంటలకు పంబకు చేరుకుంటారు. తరువాత అక్కడి నుంచి శబరిమలకు వెళ్లాలి. శబరిమలలో సొంత ఖర్చులతో బస ఏర్పాట్లు చేసుకోవాలి. మూడో రోజు తెల్లవారుజామున 3.00 గంటలకు అభిషేకంలో పాల్గొనాలి. 07:00 గంటలకు పంబకు తిరిగి బయల్దేరాలి. పంబ నుంచి నీలక్కల్‌కు సొంత ఖర్చులతోనే రావాల్సి ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు నీలక్కల్ చేరుకుంటారు.

సాయంత్రం 6:30 గంటలకు కొట్టాయం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. కొట్టాయం రైల్వే స్టేషన్‌లో రాత్రి 08.30 గంటలకు 12696 నెంబర్ గల రైలు ప్రారంభమవుతుంది. నాలుగో రోజు ఉదయం 10.00 గంటలకు మీరు చెన్నై చేరుకుంటారు. ఆసక్తిగల వాళ్లు వారు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌ ద్వారా ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.