ఐఫోన్ ధర రూ. 1. 50 కోట్లు పలికింది..కారణం ఎందుకో తెలిస్తే షాక్ తినడం ఖాయం..

ఆపిల్ ఐఫోన్ ఏకంగా కోటిన్నరకు అమ్ముడుపోయింది. ఈ విషయం తెలియగానే మీ గుండెలు గుభేల్ అనడం ఖాయం. ఎందుకంటే మార్కెట్లో లభించే అత్యంత ఖరీదైన ఐఫోన్ ధర కేవలం లక్షన్నర మాత్రమే ఉంది. అలాంటిది ఈ ఐఫోన్ ధర కోటిన్నర ఎందుకు పలికిందా అనే సందేహం మీకు కలగవచ్చు.

iPhone Price Rs 1. 50 crores has been announced..If you know the reason why, you will be shocked MKA

ఆపిల్ ఐఫోన్ ద్వారా మార్కెట్లో ఒక లక్ష పైనే ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కొత్త ఐ ఫోన్ 15 ధర దాదాపు లక్షన్నర పై మాటే ఉంది.  ఇదిలా ఉంటే తాజాగా ఓ ఐఫోన్ మోడల్  ధర ఏకంగా కోటిన్నర పలికింది. ఈ ఫోన్లో అంత స్పెషాలిటీ ఏముందని ఆలోచిస్తున్నారా. ? నిజానికి ఆపిల్ కంపెనీ తయారు చేసిన ఈ  ఈ మోడల్ ఫోన్ ప్రారంభంలో కేవలం 40,000 మాత్రమే పలికింది.  ప్రస్తుతం ఈ ఫోన్ అందుబాటులో లేదు అయినప్పటికీ ఈ ఫోన్లు వేలంపాటలో కోటిన్నర చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సిద్ధమయ్యారంటే దీని విలువ ఏంటో తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. 

సుమారు 16 సంవత్సరాల క్రితం, అంటే 2007లో, ఈ 4GB ఐఫోన్ జూన్ నెలలో ప్రారంభమైంది, ఆ సమయంలో దీని ధర US  499 డాలర్లు అంటే సుమారు 41000 రూపాయలు.  Apple 4GB iPhone తర్వాత 8GB ఐఫోన్‌ను విడుదల చేసింది యాపిల్. దీంతో కస్టమర్లు 8GB ఐఫోన్‌ను ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభించడంతో, క్రమంగా ఇది 4GB ఐఫోన్ అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ప్రజలు 4GB iPhone కంటే 8GB ఐఫోన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని Apple గ్రహించింది, అదే సంవత్సరం అంటే 2007 సంవత్సరంలో, సెప్టెంబర్ నెలలో, 4GB iPhoneని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో ఈ ఐఫోన్ కేవలం 2 నెలలకే టెక్ మార్కెట్ నుంచి కనుమరుగైపోయింది. ఈ ఫోన్ కొత్త సీల్డ్ ప్యాక్ ఇది ఇంకా యాక్టివేట్ కాకపోవడం విశేషం. 

నిజానికి పాత వస్తువులను కొనుగోలు చేసేందుకు అలాగే వాటిని సేకరించేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అందుకోసం కోట్లు సైతం ఖర్చు పెట్టేందుకు వెనకాడరు. అలాంటి కోవకు చెందింది ఈ ఐఫోన్. మొదటి తరానికి చెందిన ఈ ఐఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ లభ్యం కావడం లేదు అందుకే ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  గతంలో ఆపిల్ ఐమాక్ తొలి తరం కంప్యూటర్ సైతం  వేలం పాటలో  కోట్లు విలువ చేయడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios