iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న ఈ కనెక్షన్ తెలిస్తే, ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగడం ఖాయం..
ఆపిల్ ఐఫోన్ 15 భారత్ లో ఘనంగా లాంచ్ చేశారు. అయితే ఇందులో మొదటిసారిగా ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ GPS నావిగేషన్ సిస్టమ్ నావిక్( NavIC) Apple ఉపయోగించింది. NavIC అనేది స్వతంత్ర స్వతంత్ర నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీనిని 2018లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో రూపొందించింది.
కొత్త ఐఫోన్ 15 సిరీస్ భారతదేశంలో లాంచ్ అయ్యింది, అయితే ఈ ఐఫోన్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కనెక్షన్ ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అసలు విషయానికి వస్తే ఆపిల్ కొత్త ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో ఇస్రో రూపొందించిన GPS వ్యవస్థ అయినటువంటి NavICని సపోర్ట్ చేస్తోంది. Apple తన iPhone మోడల్‌లలో NavICకి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఫీచర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
NavIC అంటే ఏమిటి?
NavIC పూర్తి పేరు నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (Navigation with Indian Constellation) దీనిని ఇస్రో పూర్థి స్థాయిలో అభివృద్ధి చేసింది. ఇది భూమి కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. ఇది అమెరికా రూపొందించిన GPS కంటే మరింత ఖచ్చితమైన ఫలితాలు ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు. నావిక్ 2018 నుండి పనిచేస్తోంది.
గతంలో వచ్చిన iPhoneలలో GPS, GLONASS, GALILEO వంటి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేవి.ఈ సారి నావిక్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని లొకేషన్ ట్రాకింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
గత ఏడాది, భారత ప్రభుత్వం Samsung, Xiaomi, Apple వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీదారులను తమ స్మార్ట్‌ఫోన్‌లను రాబోయే కొద్ది నెలల్లో NavICకు అనుకూలంగా మార్చాలని కోరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. ఈ రిపోర్ట్్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, ఇస్రో అధికారులు NavIC సిస్టంను విస్తృతంగా ఉపయోగించేందుకు మొబైల్ కంపెనీలను కోరినట్లు తెలుస్తోంది. జనవరి 2023 నుండి విక్రయించే కొత్త ఫోన్‌లకు GPS, NavIC నావిగేషన్ కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేశారు.
NavICకి ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి?
Apple అధికారిక సమాచారం ప్రకారం ఐఫోన్ 15 ప్రో, iPhone 15 Pro Max NavICకి సపోర్ట్ ఇస్తున్నాయి. NavICకి మద్దతు ఇచ్చే ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో Xiaomi Mi 11X , 11T ప్రో, OnePlus Nord 2T, Realme 9 Pro ఉన్నాయి.
NavIC చేరికతో, భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మెరుగైన లొకేషన్-ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. GPS కవరేజీ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చైనాకు వణుకే..
యాపిల్ తీసుకున్న ఈ మార్పులను చైనాకు మరింత ఎక్కువ ఆందోళన పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆపిల్ తమ వ్యాపారాన్ని చైనా నుండి భారత్ కు షిఫ్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్‌ల తయారీకి సంబంధించి మార్పులు చేయడంపై చైనా కలత చెందింది. ఈ కారణంగానే యాపిల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని ఐఫోన్ వాడకంపై నిషేధం విధించింది. ఐఫోన్ ద్వారా చైనాపై గూఢచర్యం జరుగుతోందని చైనా అనుమానించడం గమనార్హం.