డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అంతర్జాతీయ వాణిజ్య విమానాల సర్వీసులపై ఉన్న నిషేధాన్ని నవంబర్ 30 వరకు పొడిగిస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ నిషేధం అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలకు, ప్రత్యేకంగా ఆమోదించిన విమానాలకు వర్తించవని డిజిసిఎ పేర్కొంది.

అలాగే, ఏవియేషన్ రెగ్యులేటర్ అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను కాంపిటెంట్ అతరిటి ద్వారా కేస్ టు కేస్ ప్రాతిపదికన ఎంచుకున్న మార్గాల్లో అనుమ‌తిస్తున్న‌ట్లు పేర్కొంది. యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైరస్ మ‌రోసారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డీజీసీఏ తెలిపింది. 

also readఈసారి మైనస్‌ లేదా సున్నా స్థాయిలోనే వృద్ధి : నిర్మలా సీతారామన్‌.. ...

కరోనావైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి భారతదేశంలో అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై డీజీసీఏ నిషేధాన్ని విధించింది. అయితే, ఇప్ప‌టికీ క‌రోనా విస్తృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో ప‌లు ద‌ఫాలుగా గ‌డ‌వును పొడిగిస్తూ వ‌చ్చింది.

ఇటీవ‌ల విధించిన నిషేధం గ‌డువు అక్టోబ‌ర్ 31న ముగియనుండ‌టంతో తాజాగా మ‌రోసారి నిషేధాన్ని పొడిగించింది. ‌కాగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు వందే భారత్ మిషన్ క్రింద జూలై నుండి నడుస్తున్నాయి.