కరోనా వైరస్ సంక్షోభం మధ్య భారతదేశంలో అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం ప్రకటించింది. అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్స్, ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవని ఒక సర్క్యులర్‌లో డి‌జి‌సి‌ఏ తెలిపింది.

"షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ విమానాల సస్పెన్షన్ను ఆగస్టు 31 నుండి 23:59 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్స్, ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవని" సర్క్యులర్‌లో  తెలిపింది.

"వందే భారత్ మిషన్ కింద మొత్తం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు 2,67,436 మంది ప్రయాణీకులను, ఇతర చార్టర్ ఫ్లైట్స్ ద్వారా మే 6 నుండి జూలై 30 వరకు 4,86,811 మంది ప్రయాణికులను చేర్చింది."

also read ఎస్‌బి‌ఐ బ్యాంక్‌ జోరు..అంచనాలను మించిన ఫలితాలు ...

"కోవిడ్ -19 పరిస్థితిలో ప్రయాణీకుల రద్దీని అనుమతించడానికి యుఎస్ఎ, ఫ్రాన్స్, జర్మనీలతో 'ట్రాన్స్ పోర్ట్ బబుల్' ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇటీవల ప్రయాణీకులను కువైట్ నుండి ఇండియాకి, ఇండియా నుండి  కువైట్  కి చేర్చడానికి 'ట్రాన్స్పోర్ట్ బబుల్' ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఏర్పాట్లు వివిధ దేశాల నుండి ప్రయాణీకుల కదలికలను సులభతరం చేయడానికి అవకాశం ఉంది.

జూన్ 20న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇతర దేశాలు సరిహద్దులను తెరిచిన తర్వాతే అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23న భారతదేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిలిపివేశారు. ఎయిర్ ఇండియా, ఇతర ప్రైవేటు దేశీయ విమానయాన సంస్థలు మే 6న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ కింద షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులను స్వదేశానికి తిరిగి పంపే విమానాలను నడుపుతున్నాయి. రెండు నెలల విరామం తర్వాత మే 25న భారత్ షెడ్యూల్ చేసిన దేశీయ ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించింది.