న్యూఢిల్లీ: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సంస్థలోకి పెట్టుబడుల వెల్లువ పోటెత్తుతున్నది. తాజాగా ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ అనుబం ’ఇంటెల్ క్యాపిటల్’ జియో ప్లాట్ ఫామ్స్‌లో 0.39 శాతం వాటా కొనుగోలు చేయడానికి సిద్దమైంది. మన కరెన్సీలో ఈ ఒప్పందం విలువ రూ.1,894 కోట్లు. జియో సంస్థలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఇంటెల్ క్యాపిటల్ 12వది. 

ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్ట్ నర్స్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్, ఎల్ కాటర్ టన్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసింే. ఈ పెట్టుబడుల వెల్లువతో రిలయన్స్ ఇప్పటికే రుణ రహిత సంస్థగా నిలిచిన సంగతి తెలిసిందే. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో పని చేసిన అనుభవం ఇంటెల్ క్యాపిటల్ సంస్థకు ఉన్నదని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. భారతీయులకు అత్యాధునిక టెక్నాలజీని చేరువ చేయడంలో వారి అనుభవం తమ సంస్థ జియోకు చేరువ చేస్తున్నదని చెప్పారు.

ఇంటెల్ క్యాపిటల్ అధ్యక్షుడు వెండెల్ బ్రూక్స్ మాట్లాడుతూ తక్కువ ధరతో ప్రజకు డిజిటల్ సేవలను చేరువ చేయాలన్న జియో లక్ష్యానికి, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న ఇంటెల్ క్యాపిటల్ ధ్యేయానికి సారూప్యతలు ఉన్నాయన్నారు. ఇందుకోసమే జియోతో జత కడుతున్నట్లు తెలిపారు.

also read వరుసగా 3వ రోజు దిగోచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే ? ...

తొలుత ఏప్రిల్ 22వ తేదీన ఫేస్ బుక్, జియో మధ్య తొలి ఒప్పందం కుదిరింది. 9.99 శాతం వాటా కొనుగోలు చేసిన ఫేస్ బుక్ రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మే మూడో తేదీన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ‘సిల్వర్ లేక్’ సంస్థ 1.15 శాతం వాటా కొనుగోలు చేయడంతో రూ.5,655.75 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

అమెరికాకే చెందిన మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ‘విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్’తో జియో మూడో ఒప్పందం కుదుర్చుకున్నది. విస్టా ఈక్విటీకి 2.32 శాతం వాటాను విక్రయించిన రిలయన్స్ జియో రూ.11,367 కోట్ల పెట్టుబడిని సమకూర్చుకున్నది.  

మే `7న ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ 1.34 శాతా వాటాతో రూ.6,598.38 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మే 22వ తేదీన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్’తో ఐదో ఒప్పందం కుదుర్చుకున్న జియో 2.32 శాతం వాటాతో రూ.11,367 కోట్లు పెట్టుబడులు సాధించింది. 

అబుదాబీకి చెందిన ముబాదల ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి 1.85 శాతం వాటా విక్రయంతో రూ.9093.60 కోట్లు, సిల్వర్ టేక్ సంస్థతో 0.93 శాతం వాటాతో రూ.4,547 కోట్ పెట్టుబడులు పొందింది జియో. 

గత నెల 13వ తేదీన టీపీజీ సంస్థకు 0.39 శాతం వాటా విక్రయించడంతో రూ.4546.8 కోట్లు, ఎల్ కాటర్టన్ సంస్థకు 0.39 శాతం వాటా విక్రయించడం వల్ల రూ.1,894.5 కోట్లు, 18న పీఐఎఫ్ సంస్థకు 2.32 శాతం వాటా విక్రయించి రూ.11,367 కోట్ల మేరకు జియో పెట్టుబడులను ఆకర్షించింది.