ఆకాశ్‌ అంబానీ అదుర్స్: గుర్రపు బగ్గీలో శ్లోకాతో కలిసి బ్యాచిలర్‌ పార్టీకి..

First Published 26, Feb 2019, 10:58 AM

ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా సాగాయి. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్తిజ్ హోటల్ వేదికగా మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకలకు 850 మంది అతిథులు హాజరయ్యారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి.  స్విస్‌లోని సెయింట్‌ మోర్తిజ్‌ వేదికగా  మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగాయి.

సినీ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌,అలియా భట్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, కరణ్‌ జోహార్‌, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహం వచ్చేనెల తొమ్మిదో తేదీన ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే.

వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్‌-శ్లోకా ఇద్దరు తెలుపురంగు గుర్రపు బండిలో వేదిక వద్దకు వచ్చారు. ఇదే బండిలో కాసేపు ఊరేగారు. ఈ వేడుకకు సుమారు 850 మంది అతిథులు పాల్గొన్నారని అంబానీ సన్నిహితులు తెలిపారు.

బ్లాక్ కోట్‌లో ముకేశ్ అంబానీ, ఆయన గారాల పట్టి ఇషా అంబానీ వైట్ డ్రస్‌లో ఈ కార్నివాల్‌లో అదనపు ఆకర్షణగా నిలిచారు.

అతిథుల సౌకర్యార్థం హోటల్‌ మోర్టిజ్‌లో 300కి పైగా అత్యంత విలాసవంతమైన గదులను మూడు వేదికలు బుక్‌ చేశారట. వినోదం కోసం అక్కడి లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అయితే ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా బ్యాచిలర్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అగ్రశ్రేణి బాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీకి హాజరైన అతిథుల్లో ఉన్నారు. వీరంతా ఈ లగ్జరీ అల్పైన్ రిసార్ట్ సూట్‌కు వచ్చేందుకు ఉబేర్ లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాలను బుక్ చేసుకున్నారని సమాచారం.

స్థానికులు సైతం ఈ వేడుకలను వీక్షించేందుకు అమితాసక్తి చూపినట్లు తెలుస్తోంది. వింటర్ వండర్‌లాండ్ థీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుక స్థానికులను, ఇతర పర్యాటకులనూ ఆకర్షించింది.