Asianet News TeluguAsianet News Telugu

క్యూ4లో లాభాలతో అదరగొట్టిన ఇన్ఫీ: నిరాశపర్చిన గైడెన్స్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్లో లాభాలతో అదరగొట్టింది. శుక్రవారం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 10శాతం వృద్ధి నమోదు చేసినట్లు చెప్పిన కంపెనీ.. రూ.4,074కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది.

Infosys Q4 net profit rises 10% but FY20 guidance disappoints
Author
Mumbai, First Published Apr 12, 2019, 5:27 PM IST

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్లో లాభాలతో అదరగొట్టింది. శుక్రవారం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 10శాతం వృద్ధి నమోదు చేసినట్లు చెప్పిన కంపెనీ.. రూ.4,074కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది.

ఇది స్ట్రీట్స్ అంచానా రూ.3,956 కోట్లను మించడం గమనార్హం. ఈ త్రైమాసికలో రూ.21,539కోట్ల ఆదాయం సాధించిందని తెలిపింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 19.1శాతం ఉండగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 0.6శాతంగా ఉంది. 

కాగా, ఒక్కో షేరుకు రూ.10.50 తుది డివిడెండ్‌ను ఇన్ఫీ ప్రకటించింది. డిజిటల్, పోజిషనింగ్ అంశాలపై దృష్టి పెట్టడంతోపాటు క్లైంట్లతో దీర్ఘకాలిక సంబంధాలు సంస్థ లాభాలకు కారణంగా మారాయని సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. 

అయితే గైడెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ నిరాశపర్చింది. ముగిసిన నాలుగో త్రైమాసిక గ్రోత్ 11.7శాతం ఉండగా.. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గైడెన్స్‌ను 7.5-9.5శాతానికి తగ్గించడం నిరుత్సాహం కలిగించే అంశంగా మారింది. అంతేగాక, నిర్వహణ లాభాల మార్జిన్‌లు 22.57శాతం నుంచి 21.4 శాతానికి తగ్గాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios