న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తరహాలోనే ఇతర పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పథకాన్ని అధికారులు రూపొందించారు. రుణ భారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో పేద వ్యక్తులకు సైతం రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పథకానికి అధికారులు తుది రూపు ఇస్తున్నారు.

రూ.60,000 లోపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందిపడే వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తున్నారు. అర్హులను ప్రభుత్వం గుర్తించనుంది. అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పథకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్‌సాల్వేషన్స్ లా తుది గడువు  ఇస్తున్నారు. 

 రుణ భారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో వ్యక్తులకు సైతం రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పధకానికి అధికారులు తుదిరూపు ఇస్తున్నారు. రూ 60,000లోపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడే వ్యక్తులు రుణ మాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించననుంది. 

అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పథకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్‌సాల్వెన్సీ లా కమిటీ (ఐఎల్‌సీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయయనుంది. 

ఈ పథకాన్ని భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులకు వర్తింపజేస్తున్నారు. కార్పొరేట్ దిగ్గజాలకు రుణాలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో ఇన్‌సాల్వెన్సీ పద్ధతిలో రుణాలను చెల్లించే వారి రుణాలను మాఫీ చేసే యోచనలతో ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు సహకరించాల్సి ఉంది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వానికి ఐఎల్‌సీ తన ప్రతిపాదనలను సమర్పించనుంది. రూ. 60వేల లోపు రుణాలను మాత్రమే అవకాశం ఉంది. రూ. 60వేల కంటే ఎక్కువగా రుణాలు ఉండి మాఫీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతాయి.