దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రారంభ ధర రూ.899 కే విమాన టికెట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు అందించే ఈ ఆఫర్ కింద 10లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
దీపావళి పండగను పురస్కరించుకొని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో... బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే విమాన టికెట్ ను అందిస్తున్నట్లు తెలిపింది. దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రారంభ ధర రూ.899 కే విమాన టికెట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు అందించే ఈ ఆఫర్ కింద 10లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
అక్టోబరు 24 నుంచి అక్టోబరు 26 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రారంభ ధర రూ.899కే టికెట్. నవంబరు 8, 2018, ఏప్రిల్ 15, 2019 వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణాలు చేయొచ్చు’ అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.
‘మూడు రోజుల పాటు ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరకే టికెట్‌ను అందిస్తున్నాం. ఇండిగో ప్రయాణించే 64 గమ్యస్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. తమ కుటుంబసభ్యులను, స్నేహితులను కలుసుకుని వారితో దీపావళి పండుగను జరుపుకొంటారు. అందుకే ఈ ఫెస్టివల్ సందర్భంగా మా ప్రయాణికులను తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చాం’ అని ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి తెలిపారు.
ఎయిర్‌పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదని ఆయన వెల్లడించారు. దేశీయ, విదేశీయ మార్గాల్లో ప్రయాణించే నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే నగదు తిరిగి ఇవ్వరు. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు. దీపావళి సమయంలో టికెట్ల అమ్మకాలు తప్పకుండా విమానయాన సంస్థల మధ్య ఉన్న పోటీపై ప్రభావం చూపుతాయని ఇండిగో అభిప్రయాం వ్యక్తం చేసింది.