భారతదేశంలో ఇంధన డిమాండ్ జూలైలో భారీగా పడిపోయింది, ఇది వరుసగా ఐదవ సంవత్సరం క్షీణతను నమోదు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కేసులు పెరుగుదల, దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేశాయి.

ఇంధనాల వినియోగం జూలైలో 15.68 మిలియన్ టన్నులకు పడిపోయింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 11.7% తక్కువ. గత నెల జూన్ తో పోల్చుకుంటే జూలైలో 3.5% కంటే తక్కువగా ఉంది, పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ (పిపిఎసి) నుండి వచ్చిన సమాచారం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం & న్యాచురల్ గ్యాసెస్  ఈ వివరాలను  తెలిపింది.

భారతదేశం మొత్తం ఇంధన వినియోగంలో రెండు వంతుల వాటా కలిగిన డీజిల్ వినియోగం రవాణాకు, దేశ ఇర్రిగేషన్ అవసరాలకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది, గత జూన్ నెలలో 6.31 మిలియన్ టన్నుల నుండి 5.52 మిలియన్ టన్నులకు పడిపోయింది.

also read ఎయిర్ ఏసియాకు డీజీసీఏ షాక్.. సీనియర్ అధికారులు సస్పెండ్. ...

వార్షిక ప్రాతిపదికన డీజిల్ డిమాండ్ 19.3% తగ్గింది. పెట్రోల్ అమ్మకాలు 10.3% తగ్గి 2.26 మిలియన్ టన్నులకు పడిపోయాయి. జూన్ నెలలో 2.28 మిలియన్ టన్నుల నుండి 0.8% తగ్గాయి.

ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారులలో ఒకటైన ఇండియాలో అధిక రిటైల్ ధరలు డిమాండ్ తగ్గడంతో, కరోనా వైరస్ కేసుల పెరుగుదల ఇంధన డిమాండ్ పై కూడా ప్రభావితమైంది. కరోనా వైరస్ మహమ్మారి 2 మిలియన్ల పైగా ప్రజలకు సోకింది, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ తరువాత అత్యధిక కేసులతో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.

దీనికి తోడు భారీ వర్షాలు, వరదలు ఎంతో మంది ప్రజలపై ప్రభావితం చేశాయి. అంతేకాదు కొన్ని భారతీయ రాష్ట్రాల్లో పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలను కూడా  దెబ్బతీశాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల భారతదేశంలో ఇంధన వినియోగం దాదాపు సగానికి పడిపోయింది. రోడ్ల తయారీకి ఉపయోగించే బిటుమెన్ సేల్స్ వార్షిక ప్రాతిపదికన 4.4%, నెలకు 45% పడిపోయాయి.