Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ విమానాలలో జియో మొబైల్ సర్వీసులు.. కాల్స్, డేటా ఫ్రీ..

తాజాగా రిలయన్స్ జియో 22 అంతర్జాతీయ విమానాలలో ఇన్-ఫ్లయిట్ మొబైల్ సేవలను ప్రవేశపెట్టింది. అన్ని భాగస్వామి విమానయాన సంస్థలలో డేటా, ఎస్ఎంఎస్‌ సేవలు అందుబాటులో ఉండగా, అవుట్ గోయింగ్ వాయిస్ సేవలు ఎంచుకున్న విమానయాన సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

indian telecom Reliance Jio starts offering mobile services on 22 international flights
Author
Hyderabad, First Published Sep 25, 2020, 11:41 AM IST

ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని దేశీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో వాయిస్, డేటా మరియు ఎస్ఎంఎస్‌లతో సహా ఇన్-క్యాబిన్ మొబైల్ సేవల కోసం విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇందుకోసం తాజాగా రిలయన్స్ జియో 22 అంతర్జాతీయ విమానాలలో ఇన్-ఫ్లయిట్ మొబైల్ సేవలను ప్రవేశపెట్టింది. అన్ని భాగస్వామి విమానయాన సంస్థలలో డేటా, ఎస్ఎంఎస్‌ సేవలు అందుబాటులో ఉండగా, అవుట్ గోయింగ్ వాయిస్ సేవలు ఎంచుకున్న విమానయాన సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్‌లు రూ .499 నుండి ప్రారంభమవుతుంది. ప్యాక్‌ల వ్యాలిడిటీ ఒక్కరోజే మతమే ఉంటుంది. అంతేకాకుండా జియో అందించే ఇన్- ఫ్లయిట్ కమ్యూనికేషన్ సేవల్లో ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్  సర్వీస్ ఉండదు.

also read పబ్-జి గేమ్ నిషేధం పై ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవు: మినిస్ట్రీ శాఖ ...

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ వంటి సాధారణంగా ఉపయోగించే ఓవర్-ది-టాప్(ఓ‌టి‌టి) ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కలిపి రిలయన్స్ జియో రూ.499 రూపాయల నుండి జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సెప్టెంబర్ 22న ప్రకటించింది.

అంతేకాకుండా జియో యాప్స్ సూట్‌కు ఉచిత అక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్లు రూ .499 నుండి ప్రారంభమై రూ.1,499 వరకు ఉన్నాయి. అన్ని టారిఫ్ ప్లాన్‌లలో జియో ఆన్ లిమిటెడ్ వాయిస్, మెసేజ్‌లు, డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తోంది.

రూ.499 ప్లాన్‌లో 250 ఎంబీ, రూ.699 ప్లాన్‌లో 500 ఎంబీ, రూ.999 ప్లాన్‌లో 1 జీబీ డాటా లభిస్తుందని జియో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. జియోఫోన్‌తోపాటు జియో వైఫై డివైజ్‌లో అంతర్జాతీయ రోమింగ్‌ సేవలు పనిచేయవని స్పష్టం చేసింది.

అంతేకాకుండా జియో ఫ్యామిలి ప్లాన్ ప్రకారం అదనపు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కు రూ.250 రూపాయల చొప్పున అందిస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios