Asianet News TeluguAsianet News Telugu

ఆల్ టైమ్ కనిష్టనికి రూపాయి : 33 పైసలు బ్రేక్ చేసి రూ. 80.22కి..

నేడు అమెరికాలో సెప్టెంబర్ నెల జాబ్ డేటా విడుదల కానుంది. దీంతో అక్కడ పెట్టుబడిదారులు జాగ్రత్తగా వహిస్తున్నారు. ఈ సమయంలో డాలర్ ఇండెక్స్ ఒక శాతం పెరిగి 112.26 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు డాలర్ ఇండెక్స్ 17 శాతం లాభపడింది. 

indian Rupees All Time Low: Rupee Hits New All-time Low Breaks 33 Paise To Rs 82.22
Author
First Published Oct 7, 2022, 2:39 PM IST

రూపాయి బలహీనత ధోరణి కొనసాగుతోంది. శుక్రవారం నాడు రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని దాటింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసల పతనంతో 80.22 వద్ద ట్రేడవుతోంది. దీంతో క్రితం సెషన్‌లో రూపాయి విలువ రూ.81.88 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే 2022 సెప్టెంబర్ 23న రూపాయి మొదటిసారిగా 81 రూపాయల స్థాయిని తాకింది. అంతకు ముందు జూలై 20న రూ.80 స్థాయిని దాటింది. డాలర్ ఇండెక్స్ బలపడటంతో.. ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెరిగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

నేడు అమెరికాలో సెప్టెంబర్ నెల జాబ్ డేటా విడుదల కానుంది. దీంతో అక్కడ పెట్టుబడిదారులు జాగ్రత్తగా వహిస్తున్నారు. ఈ సమయంలో డాలర్ ఇండెక్స్ ఒక శాతం పెరిగి 112.26 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు డాలర్ ఇండెక్స్ 17 శాతం లాభపడింది. 

గ్లోబల్ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణం, డాలర్ బలపడడం, రేట్ల పెంపుపై ఫెడ్ నిర్ణయం మధ్య ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి 10.6% క్షీణించింది. చికాగో ఫెడ్ ప్రెసిడెంట్ చార్లెస్ ఎవాన్స్ గురువారం మాట్లాడుతూ ఫెడ్ పాలసీ రేటు 2023 వసంతకాలం నాటికి 4.5%-4.75%కి పెరిగే అవకాశం ఉంది అని అన్నారు.

డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ కరెంట్ ఖాతా లోటు (CAD)పై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే విదేశాల నుంచి కొనుగోలు చేసి దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది రానున్న కాలంలో దేశీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలపై కూడా ప్రభావం చూపవచ్చు.  

Follow Us:
Download App:
  • android
  • ios