ఇండియన్ రైల్వే, ఐఆర్‌సిటిసి  ఆన్‌లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్‌లో  మార్పులు చేసింది. రైలు బయలుదేరే అరగంట ముందు ఇప్పుడు మరో చార్ట్  తయారుచేసి ట్రైన్ సిట్ల సమాచారం ఇస్తారు. దీని ప్రయోజనం ఏమిటంటే, చివరి క్షణంలో  ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే అత్యవసర సమయంలో ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశం ఉంటుంది.

రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ తయారుచేసి సీట్ల సమాచారం అందిస్తారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారు కొన్ని కారణాల వల్ల ప్రయాణించలేనప్పుడు అప్పుడు ఆ ఖాళీ సీట్లను రెండో చార్ట్ ద్వారా భర్తీ చేస్తారు. 

ఐ‌ఆర్‌సి‌టి‌సి ఇప్పుడు ట్రైన్ బయలుదేరే నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ ను, రైలు బయలుదేరే అరగంట ముందు రెండవ చార్ట్ తయారుచేసి ఖాళీ సీట్ల సమాచారం తెలుపుతుంది.

also read వచ్చేనెల నుంచి ఉద్యోగులకు వేతనాల పెంపు.. 80 శాతం సిబ్బందికి లబ్ధి.. ...

రెండవ చార్ట్ తయారు చేసే ముందు టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది మొదట అభ్యర్ధన చేసిన వారికి టిక్కెట్స్ ఇవ్వబడుతుంది. 'జోనల్ రైల్వే విజ్ఞప్తిపై రైల్వే ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా, రైలు బయలుదేరే అరగంట ముందు రెండవ రిజర్వేషన్ చార్ట్ తయారు చేయాలని నిర్ణయించినట్లు' ఐఆర్‌సిటిసి తన ప్రకటనలో తెలిపింది.

రెండవ చార్ట్ తయారు ముందు టికెట్లను ఆన్‌లైన్‌లో లేదా టికెట్ కౌంటర్‌లో కొనుగోలు చేయవచ్చు. కొత్త మార్పుల వల్ల ఇండియన్ రైల్వే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాయి. పండుగ సీజన్ దృష్ట్యా, ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే : ఆన్‌లైన్ రైలు టికెట్‌ను బుక్ చేసుకోవటానికి, మొదట మీరు irctc.co.in ఓపెన్ చేసి, మీ  ఐ‌ఆర్‌సి‌టి‌సి ఖాతాను క్రియేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. మీ వెళ్ళే ప్రదేశం, తేదీ, సీట్ క్యాటగిరి ఎంచుకున్న తరువాత, ఫైండ్ ట్రైన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

రైలును ఎంచుకున్న తరువాత రైలు ఛార్జీలు, లభ్యత గురించి సమాచారం పొందడానికి చెక్ అవైలబిలిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. టిక్కెట్స్ అందుబాటులో ఉంటే, మీరు బుక్ నౌ ఆప్షన్ పై క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకోండీ.