ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేని వారు టికెట్ కౌంటర్‌లో టిక్కెట్లు కొని ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి టికెట్ ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. 

రైలులో ప్రయాణించాల్సి వచ్చినప్పుడల్లా మనం ముందుగా టిక్కెట్టు కొంటుంటం. ఇప్పుడు ప్రజలు ఆన్‌లైన్ వైపు మొగ్గు చూపినప్పటికీ ప్రస్తుతం ఇంటి నుండి టిక్కెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా పెరిగింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేని వారు టికెట్ కౌంటర్‌లో టిక్కెట్లు కొని ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి టికెట్ ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీ రైలు టిక్కెట్టు ఎక్కడైన పోగొట్టుకున్నా లేదా ఎక్కడైన పడిపోయినా ఏం చేస్తారు? అప్పుడు మీరు ఎలా ప్రయాణం చేయగలుగుతారు? దీనికి సంబంధించి భారతీయ రైల్వేల నియమం ఉంది. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం..

నియమం ఏమిటి?
మీ రైలు టిక్కెట్టు ఎక్కడైన పోయినట్లయితే మీరు అలాంటి పరిస్థితిలో కూడా ప్రయాణించవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 జరిమానా చెల్లించి కొత్త టికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత హాయిగా ప్రయాణం చేయవచ్చు. రూ.50 జరిమానా కట్టి మళ్లీ టిక్కెట్లు కొనుక్కోవాల అని ఆలోచిస్తున్నట్లయితే, మీకు విధించబడే జరిమానా (టికెట్ ప్రయాణం లేకుండా) కాదని మీరు తెలుసుకోవాలి.

కొత్త టికెట్ ఎలా పొందాలి?
మీ టికెట్ పోయినట్లయితే, మీరు చేయవలసిన మొదటి పని వెంటనే టి‌టి‌ఈని సంప్రదించడం. మీ టికెట్ పోయిందని మీరు వారికి చెప్పాలి దీంతో వారు మీకు కొత్త టిక్కెట్‌ను జారీ చేస్తారు.

దీని తర్వాత టి‌టి‌ఈ మీ నుండి అదనపు ఛార్జీని వసూలు చేసిన తర్వాత మీ పేరు మీద కొత్త టిక్కెట్‌ను రూపొందిస్తారు. దీని తర్వాత మీరు మీ రైలు ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేయవచ్చు అలాగే అది కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా.

స్టేషన్ కూడా మారవచ్చు
మీరు ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్ వరకు రైలు టిక్కెట్ తీసుకున్నట్లయితే, కొన్ని కారణాల వల్ల మీరు వెళ్లాల్సిన స్టేషన్ దాటి ఇంకా ముందుకి ప్రయాణించవలసి వస్తే, మీరు మీ టిక్కెట్టును తదుపరి స్టేషన్ వరకు పొడిగించవచ్చు. దీని కోసం మీరు నామమాత్రపు చార్జీలు వసూలు చేసే టి‌టి‌ఈతో మాట్లాడాలి.