ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని మెయిల్ / ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైలు సర్వీసులను సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు భారత రైల్వే సోమవారం ప్రకటించింది. ఆగస్టు 11 తేదీతో వచ్చిన నోటిఫికేషన్‌లో రైళ్లను సెప్టెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు, ప్రత్యేక మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తూనే ఉంటాయని రైల్వే బోర్డు పేర్కొంది.

ముంబైలో అవసరమైన సేవా రంగా కార్మికుల కోసం పరిమిత సంఖ్యలో నడుస్తున్న లోకల్ రైళ్లు కూడా ఎప్పటిలాగే నడుస్తూనే ఉంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆగస్టు 12 వరకు రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బోర్డు గతంలో తెలిపింది.

 కొంకన్ వెళ్తున్న ప్రత్యేక రైళ్లపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావితం చేయదు. సెంట్రల్ రైల్వే రోజూ నాలుగు రైళ్లను కొంకన్ కు నడుపుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి కుర్లా లోక్మాన్య తిలక్ టెర్మినస్ కి రెండు రైళ్లు కేటాయించారు. వెస్ట్రన్ రైల్వే ముంబై సెంట్రల్ నుండి బాంద్రా టెర్మినస్ కు వారానికి ఐదు రైళ్లను నడుపుతుంది.

also read ఒక్కొక్కరినీ దాటుకుంటూ ప్ర‌పంచ సంపన్నుల్లో 4వ స్థానానికి ముకేశ్‌ అంబానీ ...

లాక్ డౌన్ విధించిన తరువాత ఇంటర్ డిస్ట్రిక్ట్ రైల్ సర్వీసులు అందించడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర, పశ్చిమ రైల్వే సిబ్బంది ప్రయాణికులను కోరుతున్నారు.

ఇదిలావుండగా 62,064 కొత్త కేసులతో భారతదేశంలో కరోనా వైరస్ మొత్తం కేసులు సోమవారం నాటికి 22 లక్షలను దాటింది, రికవరీ 15.35 లక్షలకు పైగా పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,007 కొత్త మరణాలతో మొత్తం కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 44,386 కు పెరిగిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కోవిడ్-19  ఆక్టివ్ కేసులు 6,34,945 ఉన్నాయి. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 22,15,074. 15,35,743 మంది కరోనా వైరస్ నుండి కోలుకోవడంతో భారతదేశ కోవిడ్-19 రికవరీ 1.5 మిలియన్లతో చారిత్రాత్మక శిఖరాన్ని దాటింది, ఎందుకంటే  కెసులు పరీక్షించడం, సమగ్రంగా ట్రాక్ చేయడం, సమర్థవంతంగా చికిత్స చేయడం వల్ల ఇది సాధ్యమైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది."మంచి అంబులెన్స్ సర్వీసులు, సంరక్షణ ప్రమాణాలపై దృష్టి పెట్టడం, నాన్-ఇన్వాసివ్ ఆక్సిజన్ వాడకం ఆశించిన ఫలితాలను ఇచ్చాయి" అని తెలిపింది.