ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ ఔషధ పదార్ధాల (ఎపిఐ) పై కస్టమ్స్ సుంకాన్ని 10-15 శాతం పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డిఓపి) యోచిస్తోంది.

స్థానిక  ఔషధాల తయారీని పెంచడానికి ప్రస్తుత 10 శాతానికి వ్యతిరేకంగా, ఎపిఐలపై 20-25 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఒక  నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం భారతదేశం 68 శాతం ఎపిఐలను, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేస్తుంది. ఔషధ పరిశ్రమ వాల్యూమ్ పరంగా ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్దది.

also read రుణాల మంజూరును బ్యాంకులు నిరాకరించవద్దు: నిర్మలాసీతారామన్‌ ...

వీటిలో చాలా వరకు భారతదేశంలో జాతీయ అవసరమైన ఔషధాల జాబితాలో (ఎన్‌ఎల్‌ఈ‌ఎం) చైనా నుండి దిగుమతి అవుతున్నాయి.  

ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,  చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది.

క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐ), ఏపీఐల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి  ఔషధ పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ)పథకాన్ని ఇటీవల డీఓపీ ప్రకటించింది.