ఎయిర్ ఇండియా (ఏ‌ఐ) సి‌ఈ‌ఓగా హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా ఎయిర్‌ ఇండియా చరిత్రలో ఒక మహిళ  భారతీయ క్యారియర్‌కు సి‌ఈ‌ఓ అయ్యారు.

ఒక నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియా సిఎండి రాజీవ్ బన్సాల్ శుక్రవారం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు, హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్‌ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎయిర్ ఇండియా సిఇఒ పదవిని నిర్వహిస్తారు అని ఉత్తర్వులో పేర్కొన్నారు.

హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (విమాన భద్రత)గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్థానంలో ఎయిర్ ఇండియా కొత్త ఈ‌డిగా కెప్టెన్ నివేదా భాసిన్ పనిచేయనున్నారు.

also read రైళ్ల ప్రైవేటీకరణపై మరో కీలక నిర్ణయం.. ప్రైవేట్ రైళ్ల ఆపరేటర్లు సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి చేయాలి...

నివేదా భాసిన్ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ విమానయాన సంస్థలో పనిచేస్తున్న  అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరు. కెప్టెన్ నివేదా బాసిన్‌ను మరికొన్ని విభాగాలకు కూడా నాయకత్వం వహించాలని ఎయిర్‌ ఇండియా కోరింది. 

హర్‌ప్రీత్ సింగ్ ఎవరు?
హర్‌ప్రీత్ సింగ్ 1988లో ఎయిర్ ఇండియాకు ఎంపికైన మొదటి మహిళా పైలట్. ఆరోగ్య కారణాల వల్ల ఆమె విమానంలో ప్రయాణించలేకపోయినప్పటికి, విమాన భద్రత విషయంలో ఆమె చాలా చురుకుగా పనిచేసేది.

ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్ హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. అసోసియేషన్లో భాసిన్, కెప్టెన్ క్షమాతా బాజ్‌పాయ్ వంటి ఇతర సీనియర్ మహిళా కమాండర్లు కూడా ఉన్నారు, వీరు నేటితరం పైలట్లలు  రోల్ మోడల్‌గా ఉన్నారు.