ముంబై: 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా వృద్ది చెందనుందని   రిలయన్స్ చీఫ్  ముఖేష్ అంబానీ చెప్పారు. 

రిలయన్స్ వాటాదారుల  సమావేశం సోమవారం నాడు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగించారు.

గత ఏడాది అత్యధిక లాభాలను సాధించి రికార్డు సృష్టించినట్టుగా ఆయన  చెప్పారు. భారత ఆర్ధిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకమైందని ఆయన గుర్తు చేశారు. రియలన్స్ జియో 340  మిలియన్ల వినియోగదారులను దాటిందని ఆయన ప్రకటించారు.

పెట్రో కెమికల్స్‌లో సౌదీ కెమికల్స్ లో సౌదీ అరాంకో‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా  ముఖేష్ ప్రకటించారు. రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసినట్టుగా ఆయన తెలిపారు.రిలయన్స్ పెట్రో కెమికల్స్ లో సౌదీ అరాంకో కంపెనీ 20 శాతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఆయన వివరించారు.

తొలిసారిగా పెద్ద ఎత్తున రిలయన్స్ లో భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు.  రిలయన్స్ బ్రాడ్ బ్యాండ్‌ను జియోగిగా ఫైబర్ ను కమర్షియల్ గా లాంచ్ చేస్తున్నట్టుగా ముఖేష్ అంబానీ ఈ సమావేశంలో ప్రకటించారు.

రిలయన్స్ జియోను 5 జీగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్టుగా ముఖేష్ తెలిపారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ నెట్‌వర్క్ ను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీకి జియో ప్రారంభించి మూడేళ్లు అవుతోందన్నారు. అయితే  ప్రతి నెల 10 మిలియన్ల మంది జియోలో భాగస్వామ్యులు అవుతున్నారని ముఖేష్ అంబానీ చెప్పారు.రిలయన్స్ జియోఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ ను ఆయన విడుదల చేశారు.జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హోం బ్రాడ్ బ్యాండ్, హైస్పీడ్ ఇంటర్నెట్, యూహెచ్‌డి సెటాప్ బాక్స్ లు అందుబాటులోకి రానున్నాయి. ఒకే కనెక్షన్ తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్ లైన్ సర్వీసులను జియో అందింనుంది.2020 జనవరి నుండి జియో ఐవోటీ సేవలను అందిస్తున్నామని ముఖేష్ ప్రకటించారు.