న్యూ ఢీల్లీ: కోవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించి 2024 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశ రాష్ట్రాలు కూడా ఆర్థిక శక్తులుగా మారడానికి కృషి చేయాలి. కోవిడ్-19 వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ అందుతుందని  ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించారు.

కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగించింది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి ఒకేలా ఉండదు.

ఆర్థిక సంస్కరణ చర్యలు కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం లేని వారి మాటలను ప్రభుత్వం వినదు. 2024 నాటికి భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. మా ప్రభుత్వానికి నిర్ణయాలను అమలు చేసిన చరిత్ర ఉందని, ప్రజలకు ఇది తెలుసునని ఒక ఇంటర్వ్యూలో మోడీ చెప్పారు.

also read  నవంబర్ 1 నుండి మారనున్న గ్యాస్ డెలివరీ రూల్స్.. ఓ‌టి‌పి లేకుంటే నో సిలిండర్.. ...

2023 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులను ఆశించకూడదని ఐఎంఎఫ్, ఇతరులు అంచనా వేసినప్పటికి ఐదు ట్రిలియన్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించవచ్చని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

దేశం ఆర్థిక శక్తిగా మారడానికి రాష్ట్రాల సహకారం కూడా అవసరం. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలు కృషి చేయాలి. కోవిడ్-19 కాలంలో రాష్ట్రాలకు ఆర్ధిక సహకారం చేశాము. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు జీఎస్టీకి మాత్రమే పరిమితం కాలేదు.

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల సంఖ్యను పెంచింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికీ వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.