Asianet News TeluguAsianet News Telugu

తిరోగమనమే: ఐఎంఎఫ్‌తోపాటు ఏడీబీది అదే బాట.. చైనాకంటే భారత్ స్పీడ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మాదిరిగానే ఆసియా అభివ్రుద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా భారత అభివ్రుద్ధి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% వ్రుద్ధిరేటు నమోదవుతుందన్న ఏడీబీ.. వాణిజ్య యుద్ధ ముప్పు, ముడి చమురు ధరల పెరుగుదల దేశీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది.

India To Remain Fastest Growing Major Economy Till 2019-20: Asian Development Bank

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల భారత ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోసే అవకాశాలున్నాయని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎడిబి) హెచ్చరించింది. 2018-19లో ద్రవ్యోల్బణం సూచీ ఐదు శాతానికి ఎగిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంతక్రితం 4.6 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఏడీబీ.. తాజాగా ఈ అంచనాలు పెంచింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణం కానున్నదని తెలిపింది. 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా, 2019-20లో 7.6 శాతంగా చోటు చేసుకోవచ్చని ఏడీబీ అంచనా వేసింది.

ఐఎంఎఫ్ ఇలా వ్రుద్ధి రేటులో కోత


ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రగతి 7.3 శాతంగా, వచ్చే ఏడాది 7.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2018లో దేశ వృద్ధి రేటు అంచనాలకు 10 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టి 7.3 శాతంగా ఉండొచ్చని ఈ వారంలోనే వెల్లడించింది. 2019 వద్ది అంచనాలనూ సైతం 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.5 శాతంగా చోటు చేసుకోవచ్చని తెలిపింది. ఇంతక్రితం ఇదే వృద్ధి రేటును 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండొచ్చని అంచనా కట్టింది. ఏడీబీ అంచనా ప్రకారం ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలతో వృద్ధికి మద్దతు లభించనుందని పేర్కొంది.

చమురు ధరలూ అడ్డంకే


పెరుగుతున్న చమురు ధరలు వృద్ధి రేటుకు అడ్డంకిగా మారనున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఏడాది జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 5.57 శాతానికి ఎగిసింది. దీంతో ధరలు 54 మాసాల గరిష్ట స్థాయికి చేరాయని క్రితం సోమవారం స్వయంగా కేంద్ర గణంకాల శాఖే వెల్లడించింది. ఇది వరకు 2013 డిసెంబరులో టోకు ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 5.88 శాతంగా నమోదైంది. గత మేలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 4.43 శాతంగా నమోదయ్యింది. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 5 శాతానికి పెరిగి ఐదు నెలలగరిష్ట స్థాయి వద్ద నమోదైంది.

మూడు నెలలుగా పెరుగుతున్న టోకు ధరలు


గత నెలలో పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయల ధరలు పెరగడంతో వరుసగా మూడో నెల టోకు ధరలు ఎగిశాయి. 2017-18లో భారత వృద్ధి రేటు 6.7 శాతంగా చోటు చేసుకుంది. 2017-18లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.7 శాతానికి చేరవచ్చునని ఏడీబీ అంచనా వేసింది.

ఆసియా రీజియన్‌కూ వాణిజ్య యుద్ధ ముప్పు


అయినా ప్రపంచంలోని ప్రధాన దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధ భయాలతో మొత్తం ఆసియా ప్రాంతం ముప్పునకు పెను సవాలు ఎదురవుతున్నదని కూడా ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త యసుయుకి సవడ పేర్కొన్నారు. ఆసియా ప్రాంతం మొత్తం మీద సగటు వృద్ధి రేటు 2018 సంవత్సరంలో 6 శాతం, 2019 సంవత్సరంలో 5.9 శాతం ఉండవచ్చని ఆసియా అభివ్రుద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. అయితే ముందుచూపుతో స్థూల ఆర్థిక విధానాలు రచించుకోవడం, విధానపరంగా కూడా అవసరమైన సద్దుబాట్లు చేసుకోవడం వల్ల ఈ సవాలును ఎదుర్కొనవచ్చునని తెలిపింది.

పొంచి ఉన్న సవాళ్లు: ఫిక్కీ


భారత ఆర్ధిక వ్యవస్థకు పలు సవాళ్లు ఎదురైనా మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఫిక్కీ అధ్యక్షుడు రాశేష్‌ షా పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది మేలో పారిశ్రామికోత్పత్తి 3.2 శాతానికి, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు శాతానికి ఎగిసినా ఇవి స్వల్ప కాల సవాళ్లేనని అన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో వృద్ధి రేటు 8 శాతానికి పుంజుకోవచ్చన్నారు. ప్రభుత్వం, ఆర్‌బిఐ ద్రవ్యోల్బణాన్ని నిశితంగా గమనిస్తున్నాయని, వాటిని అదుపు తప్పిపోకుండా నిలువరించేందుకు చర్యలు తీసుకుంటాయని అంటూ పారిశ్రామికోత్పత్తి రానున్న మాసాల్లో తిరిగి వేగం అందుకుంటుందని రాజేశ్ షా చెప్పారు. భవిష్యత్‌లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివ్రుద్ధికి జీఎస్టీ చోదకశక్తిగా ఉంటుందని అన్నారు. పరోక్ష పన్నుల విధానం ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదం చేయనుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios