Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ

ఉద్దీపన చర్యలు ప్రారంభించిన  వెంటనే జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది.

India's Economic Growth At 6-Year Low, GDP Expands 5% In June Quarter
Author
New Delhi, First Published Aug 30, 2019, 6:33 PM IST


న్యూఢిల్లీ:ఆరేళ్ల కనిష్టానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పడిపోయింది. ఆర్ధిక మంద్యానికి ముందు జాగ్రత్తగా ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే జీడీపీ పడిపోయింది

జీడీపీ 5.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది.  పలు బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించింది.దీంతో పాటు పలు ప్రకటనలను కేంద్రం చేసింది.

2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో  5.8 శాతంగా జీడీపీ నమోదైంది. శుక్రవారం నాడు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో  0.8 శాతం జీడీపీ పడిపోయింది. ఈ తగ్గుదల ఆరేళ్ల కనిష్టానికి పడిపోయినట్టుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

2013 మార్చిలో జీడీపీ ఇదే స్థాయిలో ఉంది.  ఆ సమయంలో 4.3 శాతంగా జీడీపీ నమోదైంది. ఆటోమోబైల్ రంగం కుదేలైంది.కార్ల అమ్మకాలు పడిపోయాయి.  పలు రంగాల్లో పలువురు ఉద్యోగాలను కోల్పోయారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios