ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గత నాలుగు త్రైమాసికాలలో అత్యంత వేగంగా ఉంది. వ్యవసాయం, సేవల రంగం బలమైన పనితీరు దీనికి ప్రధాన కారణం. ఇది భారత మార్కెట్‌పై ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇంకా పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా సహాయపడుతుంది.
కరోనా మహమ్మారిని అధిగమించిన తరువాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా విస్తరించింది. ఒక అంచనా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. అలాగే శుక్రవారం విడుదల చేసిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 2021 చివరి త్రైమాసికంలో భారతదేశం బ్రిటన్‌ను అధిగమించింది. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) GDP డేటా ప్రకారం
భారతదేశం మొదటి త్రైమాసికంలో ఈ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఉంది. రెండవ స్థానంలో చైనా ఉండగా తర్వాత జపాన్, జర్మనీ ఉన్నాయి. దశాబ్దం క్రితం ఈ లిస్ట్ లో భారత్ 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్ ఐదో స్థానంలో ఉండేది. అయితే భారత్ రెండోసారి ఈ ఘనత సాధించింది. అంతకుముందు 2019లో కూడా బ్రిటన్ని ఆరో స్థానానికి భారత నేట్టింది.
మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన జిడిపి గణాంకాలను భారతదేశం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. నగదు పరంగా మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, UK ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ గణాంకాలు యూఎస్ డాలర్లపై ఆధారపడి ఉంటుంది
బ్రిటన్ జీడీపీ
బ్రిటన్ జీడీపీ 3.19 ట్రిలియన్ డాలర్లు. 7 శాతం వృద్ధి రేటు అంచనాతో ఈ ఏడాది కూడా వార్షిక ప్రాతిపదికన భారత్ యూకేని అధిగమించే అవకాశం ఉంది.
భారత్ వృద్ధిరేటు కంటే కూడా చైనా లేదు
భారత్ వృద్ధిరేటు గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా కూడా ఎక్కువ లేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 0.4 శాతంగా ఉంది. ఎన్నో ఇతర అంచనాల వార్షిక ప్రాతిపదికన కూడా భారతదేశంతో పోల్చితే చైనా వెనుకబడి ఉండవచ్చని సూచిస్తున్నాయి.
వ్యవసాయం, సేవల రంగం ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచింది
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) బుధవారం డేటాను విడుదల చేసింది. వారి ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సేవల రంగం వృద్ధి రేటు 17.6 శాతంగా ఉంది, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంది. 2021-22 మొదటి త్రైమాసికంలో 2.2 శాతంగా ఉంది.
ఆర్థిక, స్థిరాస్తి, వృత్తిపరమైన సేవల వృద్ధి 2.3 శాతం నుంచి 9.2 శాతానికి పెరిగింది. అదనంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు 2021-22 అదే త్రైమాసికంలో 13.8 శాతం నుండి 14.7 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ పరిపాలన, డిఫెన్స్ ఇంకా ఇతర సేవల వృద్ధి రేటు 6.2% నుండి 26.3%కి పెరిగింది. వ్యవసాయం, సేవల రంగం బలమైన పనితీరు భారత మార్కెట్‌పై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది ఇంకా పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా సహాయపడుతుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.4% వృద్ధి రేటును సాధించే దిశగా పయనిస్తోందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు.