కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చిన  నాటికి దేశ జిడిపి చేరుకుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి హెచ్చరించారు. ఆయన ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని, ప్రజలు కరోనా వైరస్ కు భయపడకుండా సహజీవనానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్ 16వ ఎడిషన్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి చెందిన వారు తగిన జాగ్రత్తలతో పనిచేయడానికి అనుమతించే కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు.

"భారతదేశం జిడిపి కనీసం ఐదు శాతం తగ్గిపోతుందని, 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటికి అతి తక్కువ జిడిపికి మనం  చేరుకుంటామనే భయం కూడా ఉంది" అని నారాయణ మూర్తి అన్నారు. "ప్రపంచ జిడిపి పడిపోతోంది, ప్రపంచ వాణిజ్యం క్షీణించింది,

అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపుగా కనుమరుగైంది. ప్రపంచ జిడిపి 5 శాతం నుంచి 10 శాతం మధ్య కుదించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

also read 2వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్‌బిఐ.. కారణం ఏంటంటే ? ...


మార్చి 24న ఇండియా లాక్ డౌన్ మొదటి రోజు నుండే ప్రజలు మూడు కారణాల వల్ల వైరస్ తో సహజీవనానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డట్టు  నారాయణ మూర్తి చెప్పారు. ఎందుయకంటే దీనికి కరోనా వైరస్ కి టీకా లేదు, చికిత్స లేదు, ఆర్థిక వ్యవస్థ క్షీణించికూడదు అని అన్నారు.

ఆరు నుంచి తొమ్మిది నెలలలోగా దేశంలో ఎక్కడైనా అందుబాటులో ఉండేల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మొదట వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. "కానీ మేము రోజుకు 10 మిలియన్ల మందికి టీకాలు వేయగలిగిన, భారతీయులందరికీ టీకాలు వేయడానికి సుమారు 140 రోజులు పడుతుంది.

ఇది వ్యాధి వ్యాప్తిని నివారించడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది.  ఇప్పటికే  140 మిలియన్ల మంది కార్మికులు ఈ వైరస్ బారిన పడ్డారు" అని నారాయణ మూర్తి అన్నారు.