Independence Day 2025: 2025 ఆగస్టు 15 శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం. RBI నిబంధనల ప్రకారం, అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. UPI, నెట్ బ్యాంకింగ్, ATMలు, మొబైల్ యాప్స్ లాంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి.

Independence Day 2025: 2025 ఆగస్టు 15 (శుక్రవారం) నాడు భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవవేడుకలను జరుపుకుంటోంది. ఈ రోజును కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవుదినంగా ప్రకటించడంతో, దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన మూడు ప్రధాన జాతీయ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఒకటి.

ఆగస్టు 15తో పాటు మరిన్ని పండుగలు

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం తో పాటు పార్సీ నూతన సంవత్సరం (షాహెన్షాహి) కూడా ఉంది. అదే వారంలో ఆగస్టు 16న జన్మాష్టమి కూడా ఉంది. అంటే వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

బ్రాంచ్‌లెస్ బ్యాంకింగ్:

స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)న అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మూసివేయబడతాయి. అంటే కౌంటర్ సేవలు, నగదు జమ/విత్‌డ్రా, చెక్కుల క్లియరింగ్, NEFT, RTGS సెటిల్‌మెంట్‌లు, నగదు డిపాజిట్ సేవలు నిలిపివేయబడతాయి.

డిజిటల్ బ్యాంకింగ్ యధావిధిగా: ఇంకా UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులు, ATMలలో నగదు ఉపసంహరణలు వంటి డిజిటల్ సేవలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతాయి. కానీ, నగదు డిపాజిట్ సేవలు నిలిపివేయబడతాయి.

ఆగస్టులో మరిన్ని సెలవులు

 ఆగస్టు 2025లో మొత్తం 15 బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

ఆదివారాలు ( ఆగస్ట్ 3, 10, 17, 24, 31)

రెండవ, నాల్గవ శనివారాలు ( ఆగస్ట్ 10, 24)

ప్రధాన పండుగలు:

రాఖీ పౌర్ణమి– ఆగస్టు 9

స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15

జన్మాష్టమి – ఆగస్టు 16

గణేష్ చతుర్థి – ఆగస్టు 27-28

ప్రాంతీయ సెలవులు: రాష్ట్రీయంగా వర్తించని కొన్ని ఉత్సవాలు కూడా చోటుచేసుకోనున్నాయి.

ముందస్తు ప్రణాళిక

ఇలా ఆగస్టులో పలు పండుగలు, వారాంతాలు రావడంతో బ్యాంకుల వద్ద రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకే, నగదు అవసరాలు, చెక్కుల క్లియరింగ్, లేదా దస్తావేజుల పంపిణీ వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేయడం ఉత్తమం.