Independence Day 2023: ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా భారత్, విదేశీ ఏజెన్సీలు ఏం చెబుతున్నాయంటే..
భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు అవుతోంది. ఈ ఏడున్నర దశాబ్దాల ప్రయాణంలో మన దేశం నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అని కరువుతో క్షామంతో అల్లాడిన మన దేశం, ప్రస్తుతం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నపూర్ణ గా మారింది. మరోవైపు విదేశీ పెట్టుబడులకు సైతం భారతదేశ గమ్యస్థానంగా మారుతోందని నివేదికలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక ప్రగతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతదేశం ఒకవైపు 76 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను అందుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు అమెరికా , చైనా వంటి దేశాల రేటింగ్ ఏజెన్సీలు డౌన్ గ్రేడ్ చేస్తుంటే, మరోవైపు భారత్ పై తమకు నమ్మకం ఉందని క్రెడిట్ ఏజెన్సీలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ద్వారా శుభవార్త తెలిపింది.
మోర్గాన్ స్టాన్లీ కేవలం నాలుగు నెలల్లోనే భారతదేశం రేటింగ్‌ను రెండవసారి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భారతదేశ పురోగతిపై అన్ని ఏజెన్సీలు నమ్మకాన్నివ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు ముందు భారతదేశం రేటింగ్ ఈక్వల్ వెయిట్‌గా ఉంది. ఇప్పుడు ఈ రేటింగ్‌ను మరోసారి పెంచారు. భవిష్యత్తులో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఇదే విధమైన పనితీరును కనబరుస్తుందన్న ఆశాభావాన్ని బ్రోకరేజ్ సంస్థ వ్యక్తం చేసింది.
మోర్గాన్ స్టాన్లీ రిపోర్టులో భారతదేశం రేటింగ్ పెరుగుదల కారణంగా దేశంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) మార్కెట్‌లోకి రావడంతో పెద్దఎత్తున విజృంభించే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో నిర్మాణాత్మక సంస్కరణలు కనిపిస్తున్నాయని, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.
మోర్గాన్ స్టాన్లీ చీఫ్ ఏసియా ఈక్విటీ స్టాటజిస్ట్ జొనాథన్ గార్నర్ CNBC - టీవీ18 సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఆసియా మార్కెట్లలో భారతదేశం గడచిన తొమ్మిది నెలల్లో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచిందని పేర్కొన్నారు ముఖ్యంగా చైనా తైవాన్ లాంటి దేశాలను సైతం వెనక్కు తోసేలా భారతదేశం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు ప్రధానంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు సైతం భారత్ సాధించిన ప్రగతితో పోటీ పడలేక పోయినట్లు ఆయన పేర్కొన్నారు
ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువ జనాభా ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదని ఆయన పేర్కొన్నారు గార్నర్ మరిన్ని విషయాలు చెబుతూ దేశీయ స్టాక్ మార్కెట్లలో వస్తున్నటువంటి పెట్టుబడులు కూడా దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు
పెట్టుబడుల విషయంలో చైనాను భారతదేశం అతి త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు ఇటీవల భారతీయ మార్కెట్లోకి చైనా నుంచి పెట్టుబడులను ఉపసంహరించి, ప్రవేశించడాన్ని ప్రధానమైన మార్పుగా ఆయన సూచించారు. భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారతదేశం మార్గదర్శిగా నిలుస్తుందని చెబుతున్నారు. అలాగే పెట్టుబడులకు గమ్యస్థానం అవుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫాక్స్ కాన్ ద్వారా బిలియన్ల వ్యాపారం జరుగుతోంది...
ఇటీవల ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లూయి సెమికాన్ ఇండియా సదస్సులో మాట్లాడుతూ.. భారతదేశ పారిశ్రామిక విధానం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ తన విస్తరణను భారత్ లో చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక తమిళనాడు గుజరాత్లలో రెండు బిలియన్ డాలర్లతో పెట్టుబడులను పెట్టనుంది. తద్వారా 40,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా నినాదం వల్ల ప్రస్తుతం దేశంలో ఐఫోన్లు సైతం ఉత్పత్తి అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత జూలై మాసంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సెక్టార్ ఆటోమేటివ్ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీన్నిబట్టి ఈ రంగాల్లో అత్యధికమైనటువంటి వృద్ధి కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
2031 నాటికి భారతదేశం 6.7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
మోర్గాన్ స్టాన్లీ భారతదేశంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈక్వల్‌వెయిట్ నుండి దేశం , రేటింగ్‌ను పెంచింది, S&P గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో భారతదేశం సగటు రేటుతో వృద్ధి చెందితే తర్వాతి స్థానంలో ఉంటే 7 సంవత్సరాలకు 6.7 శాతం, అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 2031 నాటికి 6.7ట్రిలియన్లు అవుతుందని అంచనా వేసింది. ఇది ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉందని S&P గ్లోబల్ 'లుక్ ఫార్వర్డ్: ఇండియాస్ మనీ' పేరుతో ఒక నివేదికలో ఈ అంచనా వేసింది.