భారత్ చైనా మధ్య ఘర్షణలు, చైనా యాప్స్ బ్యాన్ మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 1,000 కోట్ల విలువైన మనీలాండరింగ్ రాకెట్‌ను నడుపుతున్న చైనా వ్యక్తులు, భారతీయ సహచరులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మంగళవారం తెలిపింది.

షెల్ కంపెనీల ద్వారా  హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు సిబిడిటి అధికారిక ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు. డమ్మీ  కంపెనీ పేర్ల ద్వారా 40కి పైగా బ్యాంకు ఖాతాలు సృష్టించి వెయ్యి కోట్లకు పైగా క్రెడిట్ ఉందని ఆదాయపు పన్ను శాఖ కనుగొంది.

"చైనా వ్యక్తుల ఆదేశాల మేరకు, వివిధ డమ్మీ సంస్థలలో 40కి పైగా బ్యాంకు ఖాతాలు సృష్టించి, వెయ్యి కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నయని" ఒక ప్రకటనలో తెలిపింది.

also read 1947కి తాకిన దేశ జిడిపి భయాలు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి హెచ్చరిక.. ...

"చైనా కంపెనీ  అనుబంధ సంస్థల ద్వారా  భారతదేశంలో వ్యాపారం, రిటైల్ షోరూమ్‌లను ప్రారంభించడానికి  ప్రయత్నించిందనీ నకిలీ కంపెనీలు, స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని "అని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.

హవాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలను,, హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీలను కూడా ఐటి విభాగం వెలికితీసింది. బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్లకు మనీలాండరింగ్‌కు సంబంధించిన సంబంధాలున్నాయని పన్ను శాఖ కనుగొంది.

"హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ బ్యాంక్ ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారంతో ఈ అక్రమాలకు పాల్పడ్డారని" స్టేట్మెంట్ లో తెలిపింది "హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలు కూడా కనుగొనింది" అని సిబిడిటి తెలిపింది.