కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు సర్వీసు ఛార్జీలని పెంచలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సర్వీస్ ఛార్జీని పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.

జన ధన్ ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలు వర్తించవని ఆర్థిక మంత్రిత్వ శాఖ నేడు తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో "బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి నెలా ఉచిత డిపాజిట్ 3, విత్ డ్రా లావాదేవీలను 3కు తగ్గించింది.

also read మెక్‌డొనాల్డ్, కెఎఫ్‌సి నుండి ఫుడ్ ఆర్డర్ చేయండి.. కస్టమర్లకు బర్గర్ కింగ్ విజ్ఞప్తి.. ...

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల తలెత్తే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బ్యాంక్ నిర్ణయించింది. అలాగే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను పెంచవు అని వివరించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి రుసుము లేకుండా నగదు డిపాజిట్, విత్ డ్రాల సంఖ్యను తగ్గించింది. పరిమితి మించి లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రతి లావాదేవీపై ఛార్జీలు చెల్లించాలి. నవంబర్ 1, 2020 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా లావాదేవీల నియమాలలో కొన్ని మార్పులు చేసింది.

 ఇతర బ్యాంకులు కూడా ఈ దిశలో పయనిస్తున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ బ్యాంకులు (పిఎస్‌బి) సర్వీస్ ఛార్జీలని పెంచుతున్నాయని కొన్ని మీడియా నివేదికలు కూడా తెలిపాయి. ఇలాంటి గందరగోళాన్ని తొలగించడానికి, ప్రభుత్వం నుండి వచ్చిన స్పష్టమైన సమాచారంతో కోటి మంది బ్యాంక్ ఖాతాదారులకు ఉపశమనం కలిగింది.