భారతదేశంలో పెరుగుతున్న కరోనా  కేసుల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చూపుతుంది. తాజాగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్  దేశ జిడిపి వృద్ధి అంచనాను తగ్గించాయి.  దీంతో నేడు  2021-22 సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను 10.4 శాతం నుండి  10.1 శాతానికి తగ్గించింది. దేశంలో  విజృంభిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ దృష్ట్యా ఈ సవరణ చేసింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో  కరోనా వైరస్ రోజువారీ కేసులు పెరుగుతుండటంతో వైద్య సదుపాయాలపై ఒత్తిడి ఉందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. అలాగే కరోనా  సెకండ్ వేవ్   మే మధ్య నాటికి బలహీనపడటం ప్రారంభమవుతుందని ఏజెన్సీ వెల్లడించింది.

జిడిపి రేటు -10.5 శాతం
ఈ నెల మొదట్లో విడుదల చేసిన మానిటరి పాలసీ రివ్యూలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు వృద్ధి మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా  మారిందని ఆర్‌బి‌ఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

also read ఫుడ్ ఆర్డర్ల పై జొమాటో కొత్త ఫీచర్‌.. అవసరం ఉంటేనే తప్ప మిస్‌ యూజ్‌ చేయకండి ! ...

కరోనా వైరస్  సెకండ్ వేవ్ ని  దృష్టిలో ఉంచుకుని ఇతర బ్రోకరేజ్ కంపెనీలు, విశ్లేషకులు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధిపై తమ అంచనాలను తగ్గిస్తున్నారు. గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత జిడిపి రేటు 7.6 శాతం  పడిపోయినట్లు అంచనా వేసింది.

కరోనా రెండవ వేవ్ పెద్ద ఆర్థిక ప్రభావాన్ని చూపదు
కరోనా వైరస్  రెండవ వేవ్ ప్రభావం మొదటి వేవ్ లో ఉన్నంత ఆర్థిక ప్రభావాన్ని చూపకపోవచ్చని ఇండియా రేటింగ్స్ సూచించింది. ఈ కారణంగా కరోనా మొదటి వేవ్  గరిష్ట స్థాయికి చేరుకునే సమయంలో కేసుల సంఖ్యతో పోలిస్తే రెండవ వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగినప్పటికీ, లాక్ డౌన్ మాత్రం లోకల్ స్థాయికి మాత్రమే పరిమితం చేయబడింది.

ఏప్రిల్ 21 నాటికి దేశంలో 13.20 కోట్ల మందికి కరోనా వాక్సిన్ అందించారు. మే 1 నుంచి 18 ఏళ్ల పై బడిన వారికి వాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, ఇందుకు 176.98 మిలియన్ డోసూలు అవసరం. పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించడంలో వాక్సిన్ ఉత్పత్తి, వాక్సిన్ అందించడం రెండూ ముఖ్యమైనవి అని తెలిపింది.