భారత్ వృద్ధిలో నో చేంజ్: వరల్డ్ బ్యాంక్ మాటే ఐఎంఎఫ్ బాట

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ప్రపంచ బ్యాంకు బాటే పట్టింది. భారత్​ సహా, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అందోళన వ్యక్తం చేసింది. 2019లో భారత వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది. ఈ సంవత్సరం వృద్ధి మందగించినా వచ్చే ఏడాది తిరిగి 7.0 శాతానికి వృద్ధి పుంజుకుంటుందని ఐఎంఎఫ్​ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు మాత్రం భారత వ్రుద్దిరేటు ఆరుశాతానికే పరిమితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

IMF slashes India's FY20 GDP growth forecast by 90 bps to 6.1%

న్యూఢిల్లీ: భారతదేశానికి ఆర్థిక మాంద్యం పొంచి ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్​) హెచ్చరించింది. భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 6.1 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్​ తాజా ముఖచిత్రంలో వెల్లడించింది.

తొలుత ఈ ఏడాది ఏప్రిల్​లో భారత వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వాహన, రియల్టీ, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నెలకొన్న అనిశ్చితుల వల్లే వృద్ధి అంచనాలు ఏకంగా 6.1 శాతానికి తగ్గించింది​ .ప్రస్తుతం కాస్త ఒడుదొడుకులు ఉన్నా 2020లో జీడీపీ తిరిగి పుంజుకుంటుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 7.0 శాతానికి పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవల.. భారత ఆర్థిక వృద్ధిని 6.9 శాతం నుంచి 6.0 శాతానికి పరిమితం చేస్తూ అంచనాలు సవరించడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చైనా జీడీపీ కూడా 6.1 శాతంగానే ఉండ వచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంత్సరం ఆ దేశ వృద్ధి మరింత క్షీణించి 5.8 శాతానికి పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది.

ప్రపంచ వ్యాపంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితులు, సరిహద్దు భయాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి ఆందోళనకరమని ఐఎంఎఫ్ హెచ్చరించింది. 2019కి ప్రపంచ వృద్ధి అంచనాను 3 శాతానికి తగ్గించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటి నుంచి వృద్ధి మందగిస్తున్నట్లు పేర్కొంది. 2017లో 3.8 శాతంగా ఉన్న వృద్ధి 3 శాతానికి తగ్గడం ఆందోళనకరమని ఐఎంఎఫ్​ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్​ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios