నీతా అంబానీ హ్యాండ్ బ్యాగు రేటెంతో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయం..ఆ డబ్బుతో ఓ పెద్ద విల్లా కొనేయచ్చు ఏమో..?

నీతా అంబానీ ఇటీవల ఓ ఫంక్షన్ లో తన ఖరీదైన బ్యాగ్ తో ప్రత్యక్షమైంది ఈ బ్యాగు విలువ దాదాపు 3.2 కోట్లు విలువ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో చాలామంది ఈ బ్యాగు కు ఖర్చు చేసే డబ్బుతో ఏకంగా ఒక పెద్ద విల్లా కొనుగోలు చేసుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు.

If you know the rate of Nita Ambani's handbag, you will be heartbroken..can you buy a big villa with that money MKA

నీతా అంబానీ నిజంగా ఒక స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోదు. ఆమె దుస్తులైనా, పాదరక్షలైనా, బ్యాగ్‌లైనా నీతా అంబానీ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ గా నిలుస్తుంటాయి. తాజాగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో, నీతా అంబానీ ప్రతి లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. మూడవ రోజు, నీతా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించారు. అక్కడ ఆమె లుక్ చాలా మందిని ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం, నీతా అంబానీ ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా  డిజైన్ చేసిన తెలుపు పూల ప్యాంటు, జాకెట్ ధరించారు.

నీతా అంబానీ ఈ సారి ఓపెన్ హెయిర్, మినిమల్ మేకప్‌తో కనిపించింది .నీతా అంబానీ లుక్‌ జనాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే  ఈసారి నీతా అంబానీ తన వెంట తెచ్చిన అత్యంత ఖరీదైన బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

నీతా అంబానీ  బ్యాగు విలువ రూ. 3.2 కోట్లు 

నీతా Foubourg Birkin 20 వైట్ మ్యాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్‌ వెంట తెచ్చుకున్నారు. బ్యాగ్ రూపకల్పన చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. దీని ప్రత్యేక నాణ్యత కారణంగా బ్యాగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ బ్యాగ్ ఖరీదు USD 4,00,000, అంటే దాదాపు రూ. 3.2 కోట్లు 

నీతా అంబానీ బ్యాగ్ ఎందుకు అంత ఖరీదు?

హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దీనికి కారణం అధిక ధర మాత్రమే కాదు. ఈ బ్రాండ్ చాలా సెలెక్టివ్ బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. అలాగే వాటిని విక్రయించడంలో మరింత సెలెక్టివ్‌గా ఉంటారు. ఈ బ్యాగ్‌లలో ఒకటి తయారు చేయడానికి  నెలలు, సంవత్సరాలు కూడా వేచి ఉండాలి.  అంతటి విలువైన ఈ బ్యాగ్ నీతా అంబానీ తన వెంట తెచ్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నీతా అంబానీ తన లైఫ్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. ముఖ్యంగా ఆమె చీరల విషయంలోనూ అలాగే ఫ్యాషన్ విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా ఉంటారు. అందుకే తరచూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు.  ఇటీవల వైట్ హౌస్ లో నిర్వహించిన విందు కార్యక్రమంలో ఆమె ధరించిన తెల్ల చీర కూడా ఒక సెన్సేషన్ అయిందంటే ఆశ్చర్యం కాదేమో.  ఎందుకంటే ఈ చీరలు తయారు చేయడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టిందని డిజైనర్లు చెబుతున్నారు. 

ముఖ్యంగా నీతా అంబానీ తన లైఫ్ స్టైల్ ద్వారా తరచూ అంబానీ కుటుంబం వైభవాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంబానీ కుటుంబం  ఏర్పాటు చేసే ఫంక్షన్లలో  నీతా అంబానీ ధరించే  దుస్తుల కోసం ముందుగానే  మీడియాలో చర్చ మొదలవుతుంది. ఆమె ధరించే చీరలు కోట్లు  ఖరీదు చేస్తాయని ఇప్పటికే పలుమార్లు వార్తల్లో తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios