Asianet News TeluguAsianet News Telugu

ఈ స్టాక్ లో జస్ట్ 15 వేలు పెట్టుబడి పెట్టి ఉంటే నేడు అక్షరాలా రూ. 1 కోటి 15 లక్షలు మీ సొంతం అయ్యేవి..

స్టాక్ మార్కెట్లో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఏ రోజైనా కోటీశ్వరులు కావచ్చు. అయితే  ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అదే సహనం, మీరు ఏ స్టాక్ కొనుగోలు చేసిన ఒడిదుడుకులను పట్టించుకోకుండా, ఫండమెంటల్స్ ను విశ్వసించి ఓపికగా ఉంటే మీరు చక్కటి లాభాలను పొందే వీలుంది. 
 

If you invest just 15 thousand in this stock today literally Rs 1 crore 15 lakhs would be yours
Author
First Published Sep 9, 2022, 1:30 PM IST

ముఖ్యంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ను గుర్తించాలి అనుకుంటే మాత్రం, ఏ కంపెనీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, ఏ కంపెనీ వ్యాపార నమూనా స్థిరంగా ఉంటుంది. కంపెనీ ఫండమెంటల్స్ ఎంత బలంగా ఉన్నాయి? దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. అంతేకాదు ఆ స్టాక్ లో దీర్ఘకాలం వేచి ఉండటం వలన భారీ రాబడిని పొందవచ్చు. ఈ రోజు మనం హావెల్స్ ఇండియా లిమిటెడ్ అనే  స్టాక్ గురించి మాట్లాడుకుందాం. 

గత రెండు దశాబ్దాల్లో తమ ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చిన కొన్ని స్టాక్‌లలో హావెల్స్ ఇండియా లిమిటెడ్  ఒకటి. మంగళవారం, సెప్టెంబర్ 6న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో హావెల్స్ ఇండియా షేర్లు రూ.1380.20 వద్ద ముగిశాయి. అయితే, మార్చి 23, 2003న, హావెల్స్ ఇండియా షేర్లు మొదటిసారిగా NSEలో జాబితా చేయబడినప్పుడు, వాటి ధర కేవలం రూ.1.89 మాత్రమే, అంటే ఈ స్టాక్ 2001 సంవత్సరం నుండి ఇప్పటి వరకు తన పెట్టుబడిదారులకు 72926.46 శాతం భారీ రాబడిని ఇచ్చింది.

అంటే 2001 మార్చి 23న హావెల్స్ ఇండియా షేర్లలో ఒక ఇన్వెస్టర్ రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, నేడు అది రూ.7.29 కోట్లకు చేరి ఉండేది. అంతే కాదు, 23 మార్చి 20001న ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో కేవలం 15000 రూపాయల పెట్టుబడి పెడితే, నేడు దాని ధర 1 కోటి 9 లక్షల రూపాయలకు పెరిగి ఉండేది. 

అయితే, గత ఏడాది హావెల్స్ ఇండియా షేర్లలో ప్రత్యేకత ఏమీ లేదు. అలాగే ఈ షేరు ధరలో 4.47 శాతం క్షీణత నమోదైంది. కానీ గత 5 సంవత్సరాలలో, ఇది దాని పెట్టుబడిదారులకు 182 శాతం రిటర్న్ అందంచింది. అంటే మీరు హావెల్స్ ఇండియా షేర్లను 5 సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, దాని విలువ 282 శాతం పెరిగి రూ.3.82 లక్షలకు చేరుకొని ఉండేది. 

జూన్ త్రైమాసికంలో కంపెనీ విలువ 62 శాతం పెరిగింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో HAVELLS INDIA LIMITED లాభం 3.47% పెరిగి రూ.242.43 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రస్తుత త్రైమాసికంలో 234.3 కోట్లు. కంపెనీ వార్షిక ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2598.2 కోట్ల నుంచి 62.8% పెరిగి రూ.4230.1 కోట్లకు చేరుకుంది. అలాగే, హావెల్స్ ఇండియా కంపెనీ  EBITDA ఏడాది ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.361.39 కోట్లకు చేరుకుంది. గతేడాది ఈ త్రైమాసికంలో రూ. 353.11 కోట్లు ఆదాయం ఆర్జించింది. 

కంపెనీ గురించి సమాచారం
హావెల్స్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 86.35 వేల కోట్లు. ఇది భారతీయ మల్టీ నేషనల్  కంపెనీ, ఎలక్ట్రికల్ పరికరాల తయారీ వ్యాపారంలో చురుకుగా ఉంది. ఈ సంస్థ 64 ఏళ్ల క్రితం 1958లో ప్రారంభమైంది. గృహోపకరణాలు, LED లైట్లు, ఫ్యాన్లు, మాడ్యులర్ స్విచ్‌లు, వైర్ ఉపకరణాలు, వాటర్ హీటర్లు, సర్క్యూట్ ప్రొటెక్షన్ స్విచ్ గేర్, కేబుల్స్, వైర్లు, ఇండక్షన్ మోటార్లు, కెపాసిటర్‌లతో సహా దేశీయ, పారిశ్రామిక అనువర్తనాల కోసం కంపెనీ విస్తృత శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తుంది. కంపెనీకి హావెల్స్, లాయిడ్, క్రాబ్‌ట్రీ, స్టాండర్డ్ ఎలక్ట్రిక్, రియో , ప్రోమ్‌ట్రాక్ వంటి అనేక బ్రాండ్‌లు ఉన్నాయి.

(నోట్: పైన పేర్కొన్న ఇన్వెస్ట్ మెంట్ సలహా నిపుణుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వడం లేదు.  ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

Follow Us:
Download App:
  • android
  • ios