పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ రాబడి మీ సొంతం
పోస్టాఫీసు పథకాలు అధిక వడ్డీని పొందే సురక్షిత పెట్టుబడి పథకాలు . పన్ను ప్రయోజనాలను అందించే పోస్ట్ ఆఫీస్ పథకాలు పిల్లలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, రైతులకు సరిపోయే వివిధ రకాల పెట్టుబడి ఎంపికలను మనకు అందిస్తాయి.
పోస్టాఫీసు పథకంలో. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ , సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి అనేక ప్రసిద్ధ పథకాలు ఉన్నాయి. జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లేదా PPF పూర్తిగా పన్ను మినహాయింపు పెట్టుబడి. రూ.500 పెట్టుబడి పెట్టి పీపీఎఫ్ పథకంలో చేరవచ్చు. గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. PPF ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ఇది సురక్షితమైన ఆదాయాన్ని అందించే సీనియర్ సిటిజన్‌ల కోసం ఒక ప్రసిద్ధ పథకం. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2%. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ బ్యాంకు లేదా పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతాను తెరవవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకం 10 సంవత్సరాల లోపు బాలికలకు మాత్రమే. ఒక ఆర్థిక సంవత్సరంలో, పథకం ద్వారా కనీసం రూ. 250 , గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా 8 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో కూడిన స్థిర పెట్టుబడి పథకం. . నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో కనీస డిపాజిట్ రూ.1,000. ప్రస్తుత వడ్డీ రేటు 7.7 శాతం.