ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికి ఒక చిట్కా చెప్పారు మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. అంతేకాదు తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు. ఆదివారం వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని మహీంద్రా సరదాగా వ్యాఖ్యానించారు 

వ్యాపారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా వుంటారు మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. సమకాలీన అంశాలపై స్పందించడంతో పాటు పలు విశేషాలను పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆయన మరో కొత్త చిట్కాతో వచ్చారు. ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికోసం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అంతేకాదు తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు. ఆదివారం వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా ఆ వీడియోలో జిమ్నాస్ట్‌లు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఏ వ్యాయామం చేయకపోయినా.. మనలో ప్రతి కండరం కదలిన భావం కలగడం ఖాయమనిపిస్తోంది. ఈ వీడియోను కనీసం రెండుసార్లు చూడాలని ఆనంద్ మహీంద్రా తెలిపారు. 

Scroll to load tweet…