షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే మీకు డీ మ్యాట్ అకౌంట్ తప్పనిసరి, అయితే మార్చి 31లోగా మీ డీమ్యాట్ అకౌంటుకు నామినీ జోడించకపోతే, అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆన్ లైన్ ద్వారా డీమాట్ అకౌంటుకు నామినీని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకోండి. 

మీకు డి-మ్యాట్ అకౌంటు ఉంటే, మార్చి 31లోపు తప్పనిసరిగా నామినీని జోడించండి. లేదంటే మీ డీమ్యాట్ అకౌంటు ఫ్రీజ్ అయిపోతుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డిమ్యాట్, ట్రేడింగ్ అకౌంటుదారులందరికీ నామినీని జోడించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాదు దానికి గడువును కూడా విధించింది. ఇంతకుముందు, డీమ్యాట్ అకౌంట్లకు నామినీలను జోడించడానికి SEBI మార్చి 31, 2022 వరకు గడువు ఇచ్చింది. అయితే, తరువాత ఈ గడువును ఒక సంవత్సరం పొడిగించారు. చాలా మంది స్టాక్‌హోల్డర్ల అభ్యర్థన మేరకు సెబీ ఈ గడువును పొడిగించింది. 

కాబట్టి, ఈసారి SEBI ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంటు కోసం నామినీని జోడించడానికి పెట్టుబడి దారులకు చివరి అవకాశం ఇచ్చింది. మీకు డీమ్యాట్ అకౌంటు ఉండి, ఇంకా నామినీని జోడించక పోతే, మార్చి 31 వరకు వేచి ఉండకుండా ఇప్పుడే చేయండి. అయితే నామినీల చేరికకు సంబం ధించి సెబీ జారీ చేసిన సర్క్యులర్‌లో ఏముంది? డీమ్యాట్ అకౌంటు కు నామినీని ఎలా జోడించాలో తెలుసుకోండి. 

జూలై 2021లో, SEBI ఇప్పటికే అర్హులైన ట్రేడింగ్ , డీమ్యాట్ అకౌంటు దారులందరికీ నామినేషన్ కోసం ఒక ఆప్షన్ ను అందించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు జూలై 2021లో సర్క్యులర్‌కు ముందు నామినీ సమాచారాన్ని సమర్పించినట్లయితే, వారు దానిని మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సెబీ తెలిపింది. ఇప్పటి వరకు నామినీ సమాచారాన్ని సమర్పించని పెట్టుబడిదారులకు మార్చి 31 వరకు గడువు ఉంది.

ఇంకా నామినీని జోడించని పెట్టుబడిదారులు తమ నామినీని సమర్పించవచ్చు లేదా స్టాక్‌బ్రోకర్ల ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నామినీని సమర్పించవచ్చు. ప్రత్యామ్నాయంగా, అటువంటి సేవలను అందించే డిపాజిట్ భాగస్వాములతో నామినీలను సమర్పించడానికి అవకాశం ఉంది. నామినీ లేదా మైనర్ నామినీ సంరక్షకుని మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID , గుర్తింపు వివరాలను అందించడం వారి ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

కొత్త ట్రేడింగ్ , డీమ్యాట్ అకౌంటును తెరిచే పెట్టుబడిదారులు తప్పనిసరిగా నామినీ సమాచారాన్ని అందించాలి. నామినీ డిక్లరేషన్ అప్లికేషన్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. ట్రేడింగ్ , డీమ్యాట్ అకౌంటు కోసం నామినీని నమోదు చేసేటప్పుడు దరఖాస్తుపై అకౌంటుదారు భౌతికంగా సంతకం చేసినందున సాక్షులు అవసరం లేదు. ఇ-సిగ్నేచర్ సదుపాయాన్ని ఉపయోగించి డిక్లరేషన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి కూడా సాక్ష్యం అవసరం లేదు. అయితే, అకౌంటు దారు సంతకం బదులుగా బొటనవేలు ముద్రను ఉపయోగిస్తే, అప్పుడు సాక్షి సంతకం అవసరం.

డీమ్యాట్ అకౌంటు కు నామినీని ఎలా జోడించాలి?
స్టెప్ 1: మీ డీమ్యాట్ అకౌంటు కు లాగిన్ చేయండి
స్టెప్ 2: ప్రొఫైల్ వర్గంలో 'మై నామినీస్' ఎంచుకోండి. ఇప్పుడు నామినీ సమాచార పేజీ తెరవబడుతుంది.
స్టెప్ 3: 'నామినీని జోడించు' లేదా 'నిలిపివేయి'ని ఎంచుకోండి.
స్టెప్ 4: నామినీ సమాచారాన్ని పూరించండి. నామినీ ID రుజువును అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు నామినీకి ఇవ్వాలనుకుంటున్న షేర్ మొత్తాన్ని 'పర్సంటేజ్' ఫీల్డ్‌లో నమోదు చేయండి.
స్టెప్ 5: ఆధార్ OTPని ఉపయోగించి పత్రంపై ఈ-సంతకం చేయండి.
స్టెప్ 6: నామినీ వివరాలను ధృవీకరించండి , 24-48 గంటల్లో డీమ్యాట్ అకౌంటు కు క్రెడిట్ చేయండి.