బ్యాంకులు, ఇతర పెట్టుబడి సాధనాల కన్నా కూడా పోస్టాఫీసు పథకాల్లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంతేకాదు పోస్టాఫీసు పథకం ద్వారా రూ. 16 లక్షల మొత్తం ఎలా సృష్టించుకోవాలో తెలుసుకుందాం. 

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పెట్టుబడికి నేటీకి కూడా అత్యంత సురక్షితమైన ఎంపికగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా భారతీయ తపాలా శాఖ అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టలేని వారికి పోస్టాఫీసు పొదుపు పథకం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ.100 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇందులో, పెట్టుబడిదారు మెచ్యూరిటీపై మంచి రాబడి లభిస్తుంది.

భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలి. నేడు మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అందులో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, క్రిప్టోకరెన్సీ మొదలైనవి అందుబాటులో కనిపిస్తుంటాయి. అయితే వీటన్నింటికీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే, మీరు దానిలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు జీరో రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లయితే, పోస్టాఫీసు పథకం దీనికి ఉత్తమమైనది.

రికరింగ్ డిపాజిట్ అనేది అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపిక, ఇందులో పెట్టే పెట్టుబడికి గ్యారంటీగా రిటర్న్ లభిస్తుంది. అంతేకాదు రికరింగ్ డిపాజిట్ అనేది అన్ని బ్యాంకులు అందిస్తున్న స్కీమే అయినప్పటికీ, పోస్టాఫీసులో మాత్రం ఇందులో అందిస్తున్న వడ్డీ ఇతర బ్యాంకుల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. 

ప్రస్తుతం పోస్టాఫీసు పథకం గురించి తెలుసుకుందాం. మంచి రాబడి కోసం పెట్టుబడి కోసం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనది. మీరు రూ.100తో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం, రికరింగ్ డిపాజిట్ పథకంపై 5.8 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి ఏదీ నిర్ణయించలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల పాటు రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. అందులో జమ చేసిన డబ్బుపై వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన అందిస్తుంది. 

మీరు ప్రతి నెలా రూ. 10000 ఏ పోస్టాఫీసు పథకంలో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల తర్వాత మీకు 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీలో మీరు రూ. 16 లక్షలు పొందుతారు.