ICICI, SBI, HDFC బ్యాంకుల్లో ఏ బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ లభిస్తుంది..? చక చకా తెలుసుకోండి..?
ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు తమ కస్టమర్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వడ్డీ రేట్లను తెలుసుకోండి.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు SBI , ప్రైవేట్ బ్యాంకులు HDFC బ్యాంక్ , ICICI బ్యాంక్ వంటి బ్యాంకులు గత ఏడాది కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ICICI బ్యాంక్ FD రేట్లను 7.60 శాతం వరకు , SBI సంవత్సరానికి 7.50 శాతం వరకు అందిస్తుంది.
HDFC బ్యాంక్
HDFC బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ FDలకు 3.50 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతం. వివిధ కాలాల వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి
>> 9 నెలల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ FDలు సాధారణ ప్రజలకు 6 శాతం , సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ.
>> 1 సంవత్సరం నుండి 15 నెలలలోపు FDల కోసం సాధారణ ప్రజలకు 6.60 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం
>> 15 నెలల నుండి 18 నెలల లోపు డిపాజిట్ల కోసం: సాధారణ ప్రజలకు 7.10 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
>> 18 నెలల నుండి 21 నెలల లోపు FDలపై సాధారణ ప్రజలకు 7 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
>> 21 నెలల నుండి 2 సంవత్సరాల వరకు, పబ్లిక్ - 7.00 శాతం , సీనియర్ సిటిజన్లు - 7.50 శాతం అందుబాటులో ఉంటారు.
>> 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల 11 నెలల FDలకు, సాధారణ ప్రజలకు రేటు 7 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
>> 2 సంవత్సరాల 11 నెలల నుండి 35 నెలల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 7.00 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
>> 2 సంవత్సరాల 11 నెలల నుండి 4 సంవత్సరాల 7 నెలల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
>> 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పెట్టుబడులకు సాధారణ ప్రజలకు 7 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
>> SBI ఏడు రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన FDలపై 3 శాతం నుండి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
>> 211 రోజుల నుండి 1 సంవత్సరం లోపు డిపాజిట్ల కోసం సాధారణ ప్రజలకు 5.75 శాతం , సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం.
>> 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ FDల కోసం, సాధారణ ప్రజలకు 6.80 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ.
>> 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 7 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.
>> 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు FDలకు సాధారణ ప్రజలకు 6.50 శాతం , సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది.
>> 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల FDలకు, వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.50 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
ICICI బ్యాంక్ వడ్డీ రేట్లు
>> 185 రోజుల నుండి 210 రోజుల కాలవ్యవధి కలిగిన FDలకు, సాధారణ ప్రజలకు 5.75 శాతం , సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.
>> 211 రోజుల నుండి 270 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.75 శాతం వడ్డీ , సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ
>> 271 రోజుల నుండి 289 రోజుల డిపాజిట్ల కోసం సాధారణ ప్రజలకు 6.00 శాతం , సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
>> 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ FDల కోసం సాధారణ ప్రజలకు 6% , సీనియర్ సిటిజన్లకు 6.50%
>> 1 సంవత్సరం నుండి 389 రోజుల వరకు FDలకు వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.70 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం.
>> 390 రోజుల నుండి 15 నెలల లోపు FDలు సాధారణ ప్రజలకు 6.70 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి.
>> 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం.
>> 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.60 శాతం
>> 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ అందించే వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 7.00 శాతం , సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.