బ్యాంకులు Fixed Depositsపై వడ్డీ రేట్లను వరుసగా పెంచుతున్నాయి. ప్రస్తుతం ప్రముఖ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ICICI Bank సైతం FDలపై వడ్డీరేట్లను సవరించింది. ఈ పథకం ద్వారా లాభాలు పొందాలంటే పూర్తివివరాలు తెలుసుకోండి.
ఐసీఐసీఐ బ్యాంక్ హోలీకి ముందే తమ కస్టమర్లకు భారీ బహుమతిని అందించింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను మార్చింది. ఐసిఐసిఐ బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసిన కస్టమర్లకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. కొత్త రేట్లు 10 మార్చి 2022 నుండి వర్తిస్తాయి.
ICICI బ్యాంక్ 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం FD చేసిన కస్టమర్ల కోసం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డిలపై 4.6 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని కాలపరిమితి 3-10 సంవత్సరాలుగా నిర్ణయించారు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, కస్టమర్లకు 4.50 శాతం వడ్డీ లభిస్తుంది.
ఎఫ్‌డిపై ఎంత వడ్డీ ఉంటుందో తెలుసుకోండి
>> రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డిలపై అన్ని రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.
>> ఈ మార్పు ప్రకారం, కస్టమర్ 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ,18 నెలల కంటే తక్కువ FDలపై 4.2 శాతం వడ్డీని పొందుతారు.
>> 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ, 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 4.3 శాతం వడ్డీ ఉంటుంది.
>> ఒక సంవత్సరం నుండి 15 నెలల వరకు FD చేసే కస్టమర్ 4.15 శాతం వడ్డీని పొందేందుకు అర్హులు.
>> ఒక సంవత్సరం కంటే తక్కువ FDలపై, బ్యాంక్ 2.5 శాతం నుండి 3.7 శాతానికి వడ్డీని ఇస్తోంది.
ఈ రేట్లలో ఎలాంటి మార్పు లేదు
2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఐసీఐసీఐ బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త, పాత రేట్లు అమలులో ఉన్నాయి. అంటే బ్యాంకు ఖాతాదారులకు ఇంతకు ముందు ఎంత వడ్డీ లభిస్తుందో అదే వడ్డీ లభిస్తుంది. అంతకుముందు, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI కూడా ఇటీవల FDలపై వడ్డీ రేట్లను మార్చింది.
