న్యూఢిల్లీ: ఆదాయం పన్ను రిటర్న్‌ల దాఖలులో 2018-19 మదింపు ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్నుశాఖ నూతన రికార్డు నమోదు చేసింది. పన్ను రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31వ తేదీతో  గడువు ముగిసింది. గడువు ముగిసే నాటికి మొత్తం 5.65 కోట్ల మంది రిటర్నులు సమర్పించినట్లు ఆదాయం పన్ను శాఖ తెలిపింది. 


రిటర్నులు దాఖలు చేసేందుకు శనివారమే చివరి రోజు కావడంతో ఆ ఒక్క రోజే 49,29,121 ఈ-రిటర్నులు దాఖలయ్యాయి. ఒక దశలో సెకనుకు 196 రిటర్నులు దాఖలయ్యాయని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 4 శాతం అధికంగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. 

2018-19 ఆర్థిక సంవత్సరానికి 5.42 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. కేరళలో గత ఏడాది వచ్చిన భారీ వరదల కారణంగా 2018-19 మదింపు సంవత్సరానికి రిటర్న్స్ గడవును 2018,ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడగించింది. రికార్డు స్థాయిలోరిటర్ను దాఖలుకు చివరి రోజున రికార్డు స్థాయిలో 49,29,121 మంది ఆన్​లైన్​లో తమ రిటర్నులను సమర్పించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.

ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం ఐదు రోజుల్లో కోటి 47 లక్షల మంది ఆన్​లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేశారు. పన్ను చెల్లింపుదారులతో ఆదాయం పన్ను శాఖ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటూ.. అవగహన పెంచడం ద్వారా రిటర్నులు పెరిగినట్లు సీబీడీటీ పేర్కొంది. 


రిటర్నలు దాఖలైనట్లు తెలిపింది. ఇదే సమయంలో రిటర్ను వెబ్​సైట్​ను పనితీరును అడ్డుకునేందుకు 2,205 సైబర్​దాడులు జరిగినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 5.65 కోట్ల ఐటీఆర్‌ల్లో 3.61 కోట్ల ఫైలింగ్​ల నిర్ధరణ పూర్తి అయిందని సీబీడీటీ వివరించింది. 


గడువులోపు దాఖలైన 5.65 కోట్ల ఐటీఆర్ నమోదుల్లో ఇందులో 79 శాతం (2.86 కోట్లు) మంది ఈ-వెరిఫికేషన్​కు ఆధార్​ ఓటీపీని ఎంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటి వరకూ 3.61 కోట్ల రిటర్నులు పరిశీలించామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలాఖరుకల్లా చెల్లింపుదారులు రిఫండ్స్‌ కోసం తమ బ్యాంకు ఖాతాతో పాన్‌ను అనుసంధానించుకోవాలని సూచించింది.