Best Family Cars: ఫ్యామిలీ అవసరాల కోసం కారు కొనాలనుకుంటున్నారా? అతి త్వరలోనే బెస్ట్ ఎస్‌యూవీ కార్లు అప్డేటెడ్ వెర్షన్స్ తో మార్కెట్ లోకి రానున్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే మీకు నచ్చిన మోడల్ ను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కొత్త మోడల్స్ లో అప్డేషన్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
ఇండియాలో బాగా అమ్ముడయ్యే ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ ఉన్నాయి. వీటికిప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రాబోయే సంవత్సరాల్లో కొత్త మోడల్స్‌తో ఇవి అప్‌గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ క్రెటా, గ్రాండ్ విటారా, సెల్టోస్ గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
కొత్త తరం మారుతి గ్రాండ్ విటారా
కొత్త మారుతి గ్రాండ్ విటారాని త్వరలోనే లాంచ్ చేస్తారని సమాచారం. కానీ లాంచ్ ఎప్పుడనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కొద్దిరోజుల కిందట టెస్టింగ్ చేస్తుండగా ఒక మోడల్ కనిపించింది. కొంచెం నిటారుగా ఉండే గ్రిల్, మార్చిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్‌తో బంపర్, కొత్త అలాయ్ వీల్స్, షార్ప్‌గా ఉండే ఎల్ఈడీ టెయిల్ లాంప్స్‌తో ఎస్‌యూవీ వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్‌లో లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ పెయిన్ సన్‌రూఫ్ కూడా ఉండొచ్చు. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
కొత్త తరం హ్యుందాయ్ క్రెటా
మూడో తరం హ్యుందాయ్ క్రెటా 2027లో వస్తుందని అంచనా. దీని ఇంజిన్‌లో పెద్ద అప్‌గ్రేడ్ ఉండొచ్చు. కొత్త క్రెటా పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కానీ 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది. కొత్త బీఎస్7 రూల్స్ వల్ల హ్యుందాయ్ డీజిల్ ఇంజిన్‌ను తీసేయొచ్చు. ఎస్‌యూవీ లోపల, బయట చాలా మార్పులు ఉంటాయి.
కొత్త తరం కియా సెల్టోస్
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న రెండో తరం కియా సెల్టోస్ 2026లో ఇండియా రోడ్ల పై పరుగులు తీస్తుంది. ఈ ఎస్‌యూవీ కొత్త మోడల్ ఈవీ5 నుంచి డిజైన్ తీసుకుంటుందని స్పై ఫొటోల్లో తెలిసింది. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, మార్చిన బంపర్లు, కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అలాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ టెయిల్ లాంప్స్ ఉండొచ్చు. కొత్త స్టీరింగ్ వీల్, కొత్త సీట్ అప్హోల్స్టరీ, మార్చిన డోర్ ట్రిమ్స్, హెడ్‌రెస్ట్‌లు, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇంటీరియర్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయి. 2026 కియా సెల్టోస్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే మొదటి కియా కారు ఇదే కావచ్చు. ఇప్పుడున్న 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల కార్లు కూడా కొనసాగుతాయని అంటున్నారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడితే రోజుకు వేలల్లో ఆదాయం, పెట్టుబడి కూడా చాలా తక్కువ
