EV Charging Station: మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ మంచి ఐడియా. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అవసరం బాగా పెరిగిపోయింది. అందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి మంచిగా సంపాదించొచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఆదాయం వస్తుంది. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈవీ స్కూటర్ నుంచి ఈ-రిక్షా, కార్, బస్ ఇలా రోడ్డు మీద చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తాయి. టాటా, మహీంద్రా లాంటి పెద్ద కార్ కంపెనీలు ఈ సెగ్మెంట్లో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా కూడా ఇండియాలో రావడానికి రెడీ అవుతోంది. అందుకే సంపాదించడానికి ఇదే ఒక మంచి ఛాన్స్. మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి రోజుకి బాగా సంపాదించొచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ప్రాసెస్, ఖర్చు, ఆదాయం తదితర వివరాలు చూద్దాం రండి.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కి ఏం కావాలి
నాలుగు లేదా ఐదు వెహికల్స్ పార్క్ చేయడానికి స్థలం ఉండాలి. ఆ స్థలం రోడ్డు మీద ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ కి పర్ఫెక్ట్ లొకేషన్ అవుతుంది. మీరు ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టి కూడా సంపాదించొచ్చు. లేదా నాలుగు ఐదు ఛార్జింగ్ పాయింట్లు కూడా పెట్టుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కావాలి. అందులో ప్రాపర్టీ పేపర్, లీజ్ అండ్ రెంట్ పేపర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, GST నంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ఈవీ ఛార్జింగ్ కంపెనీల ప్లాన్ తీసుకోవాలి. టాటా పవర్, ఛార్జ్+జోన్, ప్లగ్ఎన్కో లాంటి కంపెనీలు దీనికి ప్లాన్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు పార్టనర్షిప్లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ పెట్టడానికి ఆఫర్ ఇస్తున్నాయి. ఇలా మొత్తం 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు టూ-వీలర్ లేదా ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో కరెంట్ బిల్లు సపరేట్ గా వస్తుంది. ఈ స్టేషన్ కి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా ఎంత సంపాదించొచ్చు
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లో మీకు యూనిట్ లెక్కన ఆదాయం వస్తుంది. మీరు ఏ కంపెనీతో ఛార్జింగ్ స్టేషన్ ఛార్జర్ పెడుతున్నారో, దానికి తగ్గట్టు యూనిట్ ఖర్చు మారుతుంది. ఇందులో స్థలం అద్దె, కమిషన్, కరెంట్ బిల్లు ఇవన్నీ కలిపి లెక్కేస్తారు. ఆ తర్వాత ఒక యూనిట్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇది బట్టి ఆదాయం వస్తుంది. ఒక లెక్క ప్రకారం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లో అన్ని ఖర్చులు పోగా రోజుకి 2 వేల రూపాయల వరకు సంపాదించొచ్చు.
ఇది కూడా చదవండి