473 కి.మీ. దూసుకుపోయే కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారైన కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 473 కి.మీ. రేంజ్ వరకు పరుగులు పెట్టగలరు. మరి ఆ కారు ఏంటి? దాని ఫీచర్స్, ధర తదితర విషయాలు తెలుసుకుందాం రండి.
హ్యుండై మోటార్స్ ఇండియా కంపెనీకి చెందిన హ్యుండై క్రెటా EVని జనవరి 17న విడుదల కానుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ కారును హ్యుండై లాంచ్ చేస్తోంది. మహీంద్రా BE 6, టాటా కర్వ్, MG ZS EV, మారుతి సుజుకి e విటారా, టయోటా అర్బన్ క్రూజర్ EV లాంటి వాటితో ఈ కారు పోటీ పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ డిజైన్
హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ లో ఫ్రంట్-ఎండ్ ఛార్జింగ్ అవుట్‌లెట్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. కొత్త ఏరోడైనమిక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. SUV చుట్టూ గాలి ప్రవాహాన్ని నియంత్రించడానికి డైనమిక్ ఎయిర్ ఫ్లాప్‌లను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ఎనిమిది మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ వేరియంట్‌లను ఈ మోడల్ లో కంపెనీ అందిస్తోంది. వీటిలో మూడు మ్యాట్ కలర్స్ ఉన్నాయి.
హ్యుండై క్రెటా EV: ఫీచర్స్
ఎలక్ట్రిక్ SUV క్యాబిన్ Ioniq 5 ను బేస్ చేసుకొని తయారు చేశారు. కొత్త ఫీచర్స్, సాఫ్ట్‌వేర్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కారులో ప్రత్యేకతలు. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన సౌండ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిజిటల్ కీ, లెవల్ 2 ADAS, TPMS, 360 డిగ్రీ కెమెరా, ప్రయాణీకుల భద్రత కోసం అనేక టెక్నాలజీలు కూడా హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్‌లో ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ అనే నాలుగు వేరియంట్‌లలో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి.
బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ టైమ్
హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. అవి 51.4kWh, 42kWh. వీటిల్లో 51.4kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియట్ 473 కి.మీ. వరకు రన్ చేయగలదు. 42kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న కారు 390 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది.
DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10% నుండి 80% వరకు కేవలం 58 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 11kW AC హోమ్ ఛార్జర్‌తో నాలుగు గంటల్లో 10% నుంచి 100% ఛార్జ్ అవుతుంది. 51.4kWh బ్యాటరీ ప్యాక్‌తో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని 7.9 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ టెక్నీషియన్ టీమ్ వెల్లడించింది.