Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నుండి దుబాయ్‌కి డైరెక్ట్ ఫ్లయిట్స్ .. వారానికి మూడు విమాన సర్వీసులు..

కేంద్ర ప్రభుత్వం యూఏఈ దేశంతో కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం కింద జిఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు గురువారం నుంచి  ప్రారంభమయ్యాయి. 

Hyderabad International Airport re-connected with Dubai from Thursday
Author
Hyderabad, First Published Sep 11, 2020, 10:48 AM IST

హైదరాబాద్: అంతర్జాతీయ విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం యూఏఈ దేశంతో కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం కింద జిఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు గురువారం నుంచి  ప్రారంభమయ్యాయి.

విమాన ప్రయాణాలనికి ఇది పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి మధ్య విమాన రంగం తిరిగి కోలుకునే సంకేతాలను చూపుతోంది.

హైదరాబాద్ నుండి దుబాయ్ మధ్య యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌  ప్రతి ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారాని మూడు సర్వీసులను నిర్వహిస్తుంది. ఎమిరేట్స్ మొదటి విమానం (ఇకె 526), ​​బోయింగ్ 777- 300 ఈ‌ఆర్ విమానం ప్రయాణికులతో ఉదయం 8.25 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంది.

also read ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. రెండు దఫాలుగా వడ్డీరేటు చెల్లింపు.. ...

తిరిగి 10 గంటలకు ప్రయాణికులతో ఇకె 527 విమానం దుబాయ్‌కి బయలుదేరింది. యుఎఇకి చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ వారంలో మూడుసార్లు విమానాలను నడిపిస్తుంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కోవిడ్ -19 భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి అని తెలిపింది.  

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల సర్వీసులు నడుస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios