శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు క్రిస్మస్, న్యూఇయర్ రష్ .. రద్దీకి తగ్గట్లుగా సిబ్బంది, కొత్త ఫీచర్లు

పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రయాణీకులు పోటెత్తే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రయాణీకులకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Hyderabad Airport expands infrastructure to accommodate 15-20% increase in Christmas, New Year travel ksp

పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రయాణీకులు పోటెత్తే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రయాణీకులకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారి ఓ మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్‌లో అధిక లోడ్‌ను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణీకులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. రద్దీ నేపథ్యంలో తగినంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. 

ప్రయాణీకుల సహాయార్ధం అన్ని టెర్మినల్ జోన్‌లలో ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్స్ బృందాన్ని వుంచామని అధికారులు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ చెక్ ఇన్‌ల కోసం ఏకీకృత టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణీకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి కొత్త లాంజ్‌లు, కొత్త రిటైల్, ఫుడ్ అండ్ డ్రింక్స్ ఔట్‌లెట్‌లు, ఇండోర్ ల్యాండ్ స్కేప్‌లు, వాటర్ బాడీలతో అప్‌గ్రేడ్ చేసిన అరైవల్ హాల్‌లు ప్రవేశపెట్టినట్లు అధికారులు చెప్పారు. 

సెలవుల రద్దీకి తగ్గట్లుగా కొత్త సౌకర్యాలు, సేవలను ప్రవేశపెట్టడాన్ని ఉద్దేశించి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దేశీయ ప్రయాణీకుల ఎంట్రీ పాయింట్స్ వద్ద డిజీయాత్ర ఏకీకరణను హైలైట్ చేసింది. అదనంగా ఇది చెక్ ఇన్ కౌంటర్‌లను విస్తరించింది. స్వీయ బ్యాక్ డ్రాప్ కియోస్క్‌లను పరిచయం చేసింది. ఈ చర్యలన్నీ సరికొత్త ప్రయాణ అనుభవానికి దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios