రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(63)  సంపాదన అక్షరాల గంటకు రూ.90 కోట్లు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగి  రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58  లక్షల కోట్లకు చేరినట్టు సోమవారం విడుదలైన ‘హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020’ పేర్కొంది.

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.  రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌‌లలోకి భారీగా పెట్టుబడులు పొందిన విషయం తెలిసిందే.

ఐఐఎఫ్​ ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  9వ సారి కూడా టాప్ లో నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన ఆరునెలల పాటు ప్రతీ గంటకు రూ.90కోట్లు అర్జించారు.  

మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ – ( రూ.6,58,400)

రెండో స్థానంలోని హిందూజా సోదరుల సంపద (రూ.1,43,700 కోట్లు)

మూడో స్థానంలోని శివనాడర్, ఫ్యామిలీ  (రూ.1,41,700 కోట్లు)

నాలుగో స్థానంలోని గౌతమ్ అదానీ, ప్యామిలీ (రూ.1,40,200 కోట్లు)

5వ స్థానంలోని అజీమ్ ప్రేమ్‌జీ, కుటుంబం సంపద (రూ.1,14,400)

6వ స్థానంలోని సైరస్ పూనావాలా సంపద (రూ.94,300 కోట్లు)

7వ స్థానంలోని రాధాకిషన్ ధమానీ, ప్యామిలీ సంపద (రూ.87,200 కోట్లు)

8వ స్థానంలోని ఉదయ్ కొటక్ సంపద (రూ.87,000 కోట్లు)

9వ స్థానంలోని దిలీప్ శాంఘ్వీ సంపద (రూ.84,000 కోట్లు)

10వ స్థానంలోని సైరస్ పల్లోంజీ మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీల సంపద (రూ.70,000 కోట్ల ) చొప్పున అర్జించినట్లు  ఐఐఎఫ్​ ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో తెలిపింది. మహిళల్లో స్మితా వి క్రిష్ణ రూ. 32,400 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు.